వరంగల్, డిసెంబర్ 5 : ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై బల్దియా గ్రీవెన్స్‌లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ప్రతి గ్రీవెన్స్ మారిదిగానే ఈ సారి సైతం టౌన్ ప్లానింగ్ విభాగంపై సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని గీవెన్స్లో బాధితులు అధికారులను కోరారు. ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించాలని విన్నవించారు. సోమవారం కార్పోరేషన్ కౌన్సిల్ హాల్ నిర్వహించిన గ్రీవెన్స్‌లో కమిషనర్ ప్రావీణ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గ్రేటర్ కార్పోరేషన్ పరిధిలోని పలు డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలు వినతుల ద్వారా గ్రీవెన్స్‌లో కాలనీల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.
గ్రీవెన్స్‌లో అత్యధికంగా ఆక్రమ నిర్మాణాలు, రహదారుల ఆక్రమణలపై 32 పిర్యాదులు వచ్చాయి. రోడ్లు, డ్రైనేజీల సమస్యలను పలువురు గ్రీవెన్స్‌లో అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. బల్దియా గ్రీవెన్స్‌లో మొత్తంగా 63 వినతులు వచ్చాయి. టౌన్‌ప్లానింగ్ విభాగానికి 32, ఇంజినీరింగ్ విభాగానికి 11, తాగునీటి సరఫరా 2. ప్రజారోగ్యం, శానిటేషన్ 4, పన్నుల విభాగానికి 13, హర్టికల్చర్ విభాగానికి 1 వినతులు వచ్చాయి. ఈ గ్రీవెన్స్‌లో అదనపు కమిషనర్ రవిందర్ యాదవ్, సీఎంహెచ్వో డాక్టర్ జ్ఞానేశ్వర్, కార్యదర్శి విజయలక్ష్మి, సీహెచ్‌వో శ్రీనివాసరావు, ఎంహెచ్వో రాజేశ్, డిప్యూటీ కమిషనర్లు అనీసుర్ రషీద్, శ్రీనివాస్‌రెడ్డి, జోనా, అన్ని విభాగాల వింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.