ఖానాపురం, డిసెంబర్ 5 : పాకాల అభివృద్ధి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితోనే సాధ్యమని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ అన్నారు. పాకాల ఆయకట్టులోని పంట కాల్వల్లో పూడికతీత పనులను సోమవారం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పాకాల సరస్సును కాకతీయులు నిర్మిస్తే శాశ్వత జల వనరులను ఎమ్మెల్యే పెద్ది తీసుకువచ్చాడన్నారు. పూడికతీత పనులను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందిని కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, లాదినేని ఎల్లయ్య, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ గంగాధర రమేశ్, సర్పంచ్‌లు కాస ప్రవీణ్‌కుమార్, వెన్ను శృతి, పూర్ణచందర్, బూస రమ, అశోక్, బొప్పిడి పూర్ణచందర్రావు, బాబురావు, బందారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.