జనగామ రూరల్, నవంబర్ 21: ఆనపకాయ(సొరకాయ) పేరు వినగానే చాలా మందికి నోరూరకపోవచ్చు. కానీ కూరగాయ చేసే మేలు అంతాఇంతా కాదు. సంప్రదాయ వైద్య చికిత్సలో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. సొరకాయలో ఉండే పోషక పదార్థాలు ఏమిటో ఏ వ్యాధికి ఏ రూపంలో ఉపయోగపడుతుందో, ఎన్ని ఉత్తమ గుణాలు తెలిస్తే మీరు తినకుండా వదిలిపెట్టరు.
ప్రయోజనాలెన్నో..
సొరకాయలో కాల్సియం, పాస్ఫరస్ మిటమిన్ సీ, బీ ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. సొరకాయ శరీరానికి చల్లదనాన్నిస్తుంది. అతి సులువుగా జీర్ణమవుతుంది. మూత్రనాళ సంబంధ వ్యాధులకు ఇది దివ్యఔషధం. పచ్చి సొరకాయ రసం దాహన్ని తీరుస్తుంది. ఆలసటను తగ్గిస్తుంది. ఇనుము, పొటాషియం వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తినే వారికి సొరకాయ చక్కటి ఆహారం. ఇందులో 92శాతం నీరు ఉండడం వల్ల తిన్న ఆహారం మరింత శక్తివంతంగా జీర్ణమవుతుంది. దీన్ని భోజనంతో పాటు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మరింత వేగంగా జరుగుతుంది. బీపీ, మధుమేహ వ్యాధిగ్రస్తులకు సొరకాయ మంచి ఆహారం. ఘగర్తో బాధపడే వారు దీన్ని తిని శరీరంలోని ఇన్సూలిన్ లేవల్ను సమతుల్యంగా ఉంచుకోవచ్చు.
శరీరంలో వేడిని తగ్గిస్తుంది..
శరీర ఉష్టోగ్రత ఒకసారిగా పెరిగినప్పుడు వేడిని తగ్గడం కోసం సొరకాయను తీసుకోవడం మంచిది. శరీర బరువును కాపాడుకోవాలన్నా, తగ్గాలన్నా సొరకాయ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కాయ శరీరంలో క్యాలరీలను అతి సులభంగా తగ్గిస్తుంది. కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. సొరకాయ జూస్ తాగితే బరువు తగ్గించుకోవచ్చు.
చర్మం నిగారింపు కోసం..
శరీరం పొడి బారకుండా నిగనిగ మెరిసేందుకు సొరకాయ సాయపడుతుంది. చర్మం అంతర్గతంగా శుభ్రం కావడానికి దీనిని వాడొచ్చు. అనేక రకాల చర్మ సంబంధ రుగ్మతుల నుంచి ఇది కాపాడుతుంది. శరీరంపై మచ్చలను తొలగిస్తుంది. ఇందులో నీరు అధికంగా ఉండడం శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. వేసవిలో ఉదయం ఒకగ్లాస్ సొరకాయ రసం తాగితే వడదెబ్బ తగలకుండా ఉంటుందని నిఫుణులు చెబుతున్నారు. వంటకంగా తినడానికి సొరకాయ ఎలాంటి అభ్యంతరాలే లేవు. రసం రూపంలో తీసుకోవాలంటే మాత్రం వైద్యుడి సలహా తప్పనిసరి.
కిడ్నీ, కాలేయ సమస్యలకు చెక్
కిడ్ని సమస్య ఉన్నవారు అప్పటికే డయాలసిస్ చేయించుకుంటున్నట్లయితే సొరకాయను రెగ్యులర్గా తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. డయాలసిస్ చేసుకునే వారు దృఢంగా ఉండేలా శక్తినిస్తుంది. అలాగే లివర్ ఇన్ఫమేషన్ను తగ్గించుకోవాలంటే సొరకాయను తీసుకోవాలి. అన్ని రకాల కాలేయ సమస్యలు పరిష్కరిస్తుంది. దీంతో పాటు అన్ని రకాల ఉదర సంబంధ సమస్యలు నివారిస్తుంది. సొరకాయను జ్యూస్ చేసి అందులో చిటికెడు ఉప్పు వేసి మూడ్రోజులు తీసుకుంటే కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా త్వరగా తగ్గిపోతుంది. ప్రతిరోజు తినే ఆహారంతో పాటు ఒకగ్లాస్ సొరకాయ రసంలో ఇక చెంచా నిమ్మరసం కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇది మూత్రనాళంలో ఉండే మంటను తగ్గిస్తుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల సొరకాయ ఆజీర్తికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మలబద్దకం, మొలలు వంటి అనేక వ్యాధులను నివారిస్తుంది.