నర్సంపేటరూరల్, నవంబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లెలకు సైతం మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నారని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ అన్నారు. మండలంలోని భోజ్యానాయక్‌తండా నుంచి మాదన్నపేట వరకు బీటీరోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 72 లక్షలు మంజూరు చేసింది. ఈ మేరకు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీ పీ మోతె కళావతి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, సర్పంచ్‌లు భూక్యా లలిత, మొలుగూరి చంద్రమౌళితో కలిసి శుక్రవారం సత్యనారాయణ సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేస్తున్నారని తెలిపారు. ప్రతి పల్లెకు తారురోడ్డు వేసేందుకు రా ష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కృషితో నర్సంపేట నియోజకవర్గంలోని పల్లె లు అభివృద్ధి బాట పడుతున్నాయని కొనియాడారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు భూక్యా వీరూనాయక్, కట్ల సుదర్శన్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, అజ్మీరా వీరన్న, ఆకుతోట కుమారస్వామి, మేగ్యానాయక్, పెసరు సాంబరాజ్యం, కడారి కుమారస్వామి, బీ రాజు, ఉప్పుల భిక్షపతి పాల్గొన్నారు.