మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించడంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. బ్యాండ్ వాయిద్యాల మధ్య కార్యకర్తలు, నాయకులు నృత్యాలు చేస్తూ ఊరూరా వేడుకలు నిర్వహించారు.
నర్సంపేట/వర్ధన్నపేట/చెన్నారావుపేట/దుగ్గొండి/నల్లబెల్లి, నవంబర్ 6: నర్సంపేట పట్టణంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, యూత్ అధ్యక్షుడు రాయిడి దుశ్యంత్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు విజయంతో బీఆర్ఎస్కు దేశంలో తిరుగులేదన్నారు. కార్యక్రమంలో నాయకులు నామాల సత్యనారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, గంప రాజేశ్వర్‌గౌడ్, పుట్టపాక కుమారస్వామి, మండల శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వర్ధన్నపేట మండలం కట్య్రాలలో ఏఎంసీ మాజీ చైర్మన్ గుజ్జ సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు.
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై సంపత్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఇల్లందలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు సంబురాలు జరిపారు. చెన్నారావుపేటలో వైస్ ఎంపీపీ, మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు జరిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, మాజీ ఎంపీపీ జక్క అశోక్, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ గఫార్, నాయకులు కృష్ణచైతన్య, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
దుగ్గొండితోపాటు గిర్నిబావి సెంటర్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి నాయకులు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలవ్యాప్తంగా పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
అంబురాన్నంటిన సంబురాలు
నర్సంపేటరూరల్/నెక్కొండ/రాయపర్తి/గీసుగొండ/ఖానాపురం/సంగెం: మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపొందడంపై హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్(బీఆర్ఎస్) శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహించి పటాకులు కాల్చారు. మాదన్నపేటలో టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తడిగొప్పుల మల్లేశ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నర్సంపేట-చంద్రయ్యపల్లి ప్రధాన రహదారిలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో నాయకులు పెసరు సాంబరాజు, కడారి కుమారస్వామి, ప్రవీణ్, విక్రం, క్రాంతి, రాకేశ్, పరమేశ్, మొగిలి, నర్సయ్య, జంపయ్య, ప్రియదర్శన్, సర్వేశ్వర్, రాజు, రమేశ్, కుమార్, మనోజ్ పాల్గొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించడంతో నెక్కొండలో టీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, పార్టీ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్ నాయకులు చల్లా చెన్నకేశవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొణిజేటి భిక్షపతి, ఉప సర్పంచ్ వీరభధ్రయ్య, రామాలయ కమిటీ చైర్మన్ పొడిశెట్టి సత్యం, పెద్దకోర్పోలు సర్పంచ్ మహబూబ్‌పాషా, నాయకులు గుంటుక సోమయ్య, మాదాసు రవి, తాటిపెల్లి శివకుమార్, హెచ్ శ్రీను, కారింగుల సురేశ్, తాళ్లపెల్లి చెన్నకేశవులు పాల్గొన్నారు.
రాయపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై అంబరాన్నంటేలా విజయోత్సవ సంబురాలను పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకుడు బీ సుధీర్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, పూస మధు, సర్పంచ్‌లు గారె నర్సయ్య, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, బోనగిరి ఎల్లయ్య, అయిత రాంచందర్, వనజారాణి, ఎం వెంకటేశ్వర్లు, నయీం, యాదవరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సత్యం, ప్రసాద్, యాదగిరిరెడ్డి, రవీందర్రావు, ఉస్మాన్, సుధాకర్‌యాదవ్, రామ్‌యాదవ్, రామశేఖర్, సంతోష్‌గౌడ్, గురుణాథం పాల్గొన్నారు.
గీసుగొండ మండలంతోపాటు వరంగల్ 15, 16వ డివిజన్లో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. కోనాయిమాకులలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, పార్టీ మండల అధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు జైపాల్‌రెడ్డి, బాబు, నాగేశ్వర్రావు, మల్లారెడ్డి , ఎంపీటీసీ వీరరావు, నాయకులు డోలి చిన్ని, కోటా ప్రమోద్, శ్రీకాంత్, సంతోష్, సునీల్, సంపత్, ధనుంజయ్ పాల్గొన్నారు. ఖానాపురంలో టీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు.
ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటనర్సయ్య, బాబురావు, మౌలానా, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, అశోక్, సుధాకర్, శ్రీను, వెంకటేశ్వర్లు, రాజు, బాలు, తరాల శ్రీను, చెన్నూరి సత్యం, దాసరి రమేశ్, నాగరాజు, కుందెనపల్లి శైలజ, శ్వేత పాల్గొన్నారు. సంగెంలోని అంబేద్కర్ కూడలిలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి సారంగపాణి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గుండేటి బాబు, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సొసైటీ చైర్మన్ కుమారస్వామి, సంగెం ఎంపీటీసీ మల్లయ్య, కోఆప్షన్ సభ్యుడు మన్సూర్‌అలీ పాల్గొన్నారు.
వరంగల్ నగరంలో వేడుకలు..
కాశీబుగ్గ/పోచమ్మమైదాన్/వరంగల్‌చౌరస్తా: మునుగోడులో టీఆర్ఎస్ విజయంతో వరంగల్ నగరంలోని పలు చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరిపారు. 3వ డివిజన్ ఆరెపల్లి జంక్షన్లో కార్పొరేటర్ జన్ను షీభారాణి ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కొత్తపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. వరంగల్ గోపాలస్వామి గుడి జంక్షన్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు.
23వ డివిజన్ మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి, పటాకులు కాల్చారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ యెలుగం రవిరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ 36వ డివిజన్లో నాయకులు సంబురాలు నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా మైనారిటీ నాయకుడు ఎండీ మసూద్ హాజరై రంగులు చల్లుకొని మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్కు మునుగోడు ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. బీజేపీ నాయకులు చేసిన కుయుక్తులను ఓటర్లు నమ్మలేదన్నారు.
నృత్యాలు చేసి.. ర్యాలీ తీసి..
గిర్మాజీపేట: వరంగల్చౌరస్తాలో 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన-నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బీజేపీకి మునుగోడు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇదే ఫలితం రిపీట్ అవుతుందన్నారు. రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్(బీఆర్ఎస్) అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు ఆనందంతో ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. కార్పొరేటర్ కల్పన బ్యాండ్ కొట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. టీఆర్ఎస్ నేత గందె నవీన్ నృత్యంతో కార్యకర్తల్లో జోష్ నింపారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, చింతాకుల అనిల్, మరుపల్లి రవి, భోగి సువర్ణా సురేశ్, ఎండీ పుర్ఖాన్, పస్కుల బాబు, కావేటి కవిత, సిద్దం రాజు, పల్లం పద్మ-రవి, ఉమా దామోదర్, టీఆర్ఎస్ నాయకులు హరిరమాదేవి, టీ రమేశ్‌బాబు, ఎన్ సంజయ్, కే శ్రీనాథ్, రాజేందర్, రవికుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, నరేశ్మోక్ష, మధుకర్, సీతారాం, రవికుమార్ పాల్గొన్నారు. అలాగే, 33వ డివిజన్లో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ-సుధాకర్ దంపతులు, 26వ డివిజన్లో కార్పొరేటర్ సురేశ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, ముఖ్య నాయకులు సంబురాలు నిర్వహించారు.