వరంగల్, నవంబర్ 5 : కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అభివృద్ధి ఆధ్వర్యంలో మడిపల్లిలోని మా సిటీలో 13న ప్లాట్ల కు వేలం నిర్వహించనున్నారు. 150 ఎకరాల్లో కుడా మా సిటీ పేరిట వెంచర్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు శనివారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూ రి రమేశ్, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, వైస్ చైర్పర్సన్ ప్రావీణ్య మా సిటీ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ.. కాకతీయ పట్ణణాభివృద్ధి ఆధ్వర్యంలో మా సిటీ అభివృద్ధి జరుగుతోందన్నారు. అన్ని వసతులతో అభివృద్ధి చేసి ప్లాట్ల వేలం వేస్తున్నారని వివరించారు. కుడా నమ్మకానికి నిలువుటద్దమని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ.. ఇప్పటికే వరంగల్ ఓ సిటీ లో పాట్లు వేలం వేసి అన్ని వసతులు కల్పించిన కుడా ప్రసు త్తం మడిపల్లిలో మా సిటీ పేరుతో అభివృద్ధి చేయడం అభినందనీయమన్నారు.
కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్ మాట్లాడుతూ హైదరాబాద్ తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ నగరంలో కుడా ఆధ్వర్యం లో మా సిటీని అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలా మా సిటీలో ప్లాట్లను ఏర్పాటు చేశామన్నారు. కుడా వైస్ చైర్పర్సన్ ప్రావీణ్య మా ట్లాడుతూ.. మడిపల్లిలో 150 ఎకరాల్లో మా సిటీ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. 2019లో మొదటి విడుత ప్లాట్ల వేలం నిర్వహించామని, రెండో విడుత ఈ నెల 13న నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో 98 ప్లాట్లు విక్రయిస్తామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుకు కేవలం 6 కిలోమీటర్ల దూరం లో ఉన్న మా సిటీలో రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, గ్రీనరీ ని అభివృద్ధి చేశామన్నారు. 200, 300 గజాల ప్లాట్లతో పాటు మొదటి సారిగా ఫాంహౌస్ కట్టుకునేందుకు వీలుగా వెయ్యి గజాల చొప్పున 10 ప్లాట్లను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. రూ.25వేలు చెల్లించి టోకెన్ తీసుకొని వేలంలో పాల్గొనాలని కోరారు. ప్లాట్లు దక్కించుకున్న వారు ప్లాటు విలువలో 25 శాతం డబ్బులు మూడు రోజుల్లో చెల్లించాలని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ము మూడు నెలల గడువులోగా చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.
ప్రారంభ ధర రూ.8 వేలు..
మా సిటీ ప్లాట్ల వేలంలో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ప్రారంభ ధర గజానికి రూ.8 వేలు నిర్ణయించినట్లు వైస్ చైర్పర్సన్ ప్రావీణ్య తెలిపారు. తొలి విడుత రూ. మూడు వేల ప్రారంభంతో పాట ప్రారంభించామని అన్నారు. హెచ్చు పాటదారుడికి ప్లాటు దక్కుతుందని తెలిపారు. ఫాంహౌస్ నిర్మించుకునేందుకు వెయ్యి గజాలతో 10 ప్లాట్లు ఏర్పాటు చేశామని అన్నారు. సమావేశంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా కార్యదర్శి మురళీధర్‌రావు, ప్లానింగ్ అధికారి అజిత్‌రెడ్డి, ఈఈ భీంరావు తదితరులు పాల్గొన్నారు.