ఖానాపురం, అక్టోబర్ 30: టీఆర్ఎస్(బీఆర్ఎస్)తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ మండల ఉపాధ్యక్షుడు, వార్డు మెంబర్ ఉప్పు రాజు మునుగోడులో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేశారు. ఈ సందర్భంగా రాజుకు ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను టీఆర్ఎస్ సర్కారు తెలంగాణలో అమలు చేస్తున్నదని పెద్ది గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత రైతుల కలలను సాకారం చేస్తూ గోదావరి జలాలను పాకాలకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన గుగులోత్ రామస్వామి, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణు, నాయకులు సాంబయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.