రాయపర్తి, అక్టోబర్ 17: రైతులు రబీలో ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త సౌమ్య సూచించారు. సోమవారం మండలంలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని రైతువేదిక భవనంలో మొరిపిరాల వ్యవసాయ క్లస్టర్‌లోని పలు గ్రామాలకు చెందిన రైతుబంధు సమితి ప్రతినిధులు, పలు గ్రా మాలకు చెందిన రైతులకు మండల వ్యవసాయ శాఖ పక్షాన పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వ విద్యాలయం-కృషి విజ్ఞాన కేంద్రం-మామునూరు సారథ్యంలో రబీ కాలానికి అనువైన ఆరుతడి పంటల పరిచయ కార్యక్రమం-అవగాహన సదస్సులు నిర్వహించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ అధిక నీటిని వినియోగించి, పండించే వరి, మక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా రైతులు వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు సా గు చేసుకోవాలని సూచించారు. వేరుశనగ పంటను సాగు చేసుకునేందుకు రైతులకు అక్టోబర్ అనుకూలమైనదని, ఎకరాకు 80 కిలోల విత్తనాలతో వేరుశనగ పంటను సాగు చేయాల్సిందిగా సూచించారు. పంటల సాగులో రైతులు వ్యవసాయాధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, ప్రతినిధుల సలహాలు, సూచనలు పాటించాల్సిందిగా కోరా రు. ఈ సమావేశంలో ఏవో-టెక్నికల్ భవానీమాత, మండల వ్యవసాయ విస్తరణాధికారిణి రాజారపు శిరీష, ఆర్అండ్ఆర్ కాలనీ సర్పంచ్ చెడుపాక కుమారస్వామి, పలు గ్రామాల రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ పారుపల్లి సుధాకర్‌రెడ్డి, లేతాకుల మాధవరెడ్డి, బీ రంగారెడ్డి, పన్యానాయక్ తండా సర్పంచ్ భూక్యా వెంకట్రాంనాయక్, కన్నెకంటి శ్రీనివాస్‌రెడ్డి, ఏ యాకూబ్‌రెడ్డి, కుమారస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.