ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన రామప్ప ఆలయం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్‌కతా నగరంలోనూ ఉందా..? అనేలా తీర్చిదిద్దాడు ఆర్టిస్ట్ దీపక్ ఘోష్.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలో ఉన్న రామప్పకు డూప్లికేట్‌ను అత్యద్భుతమైన సెట్టింగ్స్‌తో ఆరు నెలల్లో నిర్మించాడు. పలు కట్టడాల తయారీలో అనుభవమున్న ఆయన, 85 మంది టెక్నీషియన్లు, 100 మంది వర్కర్లతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశాడు. ఫైబర్, ైప్లెవుడ్, కర్ర, థర్మోకోల్‌ను వినియోగించి కళా కృతులు, శిల్పాలతో సుందరంగా మలిచాడు.
– వెంకటాపూర్, అక్టోబర్ 17
కోల్‌కతా నగరంలో రామప్ప దేవాలయ నమూనాను అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆరిస్ట్ దీపక్ఘోష్. ఫైబర్, ైప్లె వుడ్, కర్ర, థర్మోకోల్‌ను ఉపయోగించి శిల్పాలు, కళా కృతులతో కాకతీయుల కట్టడాన్ని పోలినట్లుగా తయారుచేశాడు. ఆరు నెలల పాటు 85 మంది టెక్నీషియన్లు, 100 మంది కార్మికులతో కలిసి ఈ సెట్టింగ్ నిర్మించాడు. దీన్ని చూస్తే రామప్ప ఆలయం ధ్వంసం కాకముందు ఈ విధంగా ఉండేదా..? అని అనిపించకమానదు.
రామప్పకు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత ఎలాగైనా ఈ ఆలయ నమూనాను తయారుచేయాలని గత మార్చి లో తన బృందం ముఖ్య సభ్యులతో రామప్పకు వచ్చిన దీపక్ఘోష్.. మూడు రోజులపాటు ఆలయంలో ఉన్న ప్రతి శిల్పా న్ని ఫొటోలు, వీడియోలు తీసుకొని, కొన్ని ముఖ్యమైన శిల్పాలను పేపర్‌పై గీసుకొని వెళ్లాడు. రామప్ప గురించి ప్రొఫెసర్ పాండురంగారావు, టూరిజం గైడ్ ద్వారా తెలుసుకొని తనదైన శైలిలో నిర్మించాడు. ఇక్కడి శిల్పాలను చూస్తే శిల్పి రామప్ప మరోసారి వచ్చి మలిచారా అనేలా చూడచక్కగా చెక్కారు.
వి నాయకుడి విగ్రహం, ద్వారపాలకులు, ఏనుగులు, గజకేసరులు, మదనికల శిల్పాలు, స్తంభాలు అచ్చుగుద్దినట్లు రామప్ప శిల్పాలను పోలినట్లుగా సుందరంగా రూపొందించారు. వీటిని చూస్తే రాయి తో చెక్కినట్లుగానే కనిపించేలా రంగుల తో అద్దారు. దీని నిర్మాణానికి రూ.80 లక్షలు ఖర్చు చేశారు. దుర్గా మాత ఉత్సవాల పూజలకు వీటిని వినియోగించి, నెలరోజల తర్వాత వి ప్పేస్తామని దీపక్ఘోష్ తెలిపారు.