హసన్‌పర్తి, అక్టోబర్ 16 : దేశంలో ఎక్కడా లేని విధంగా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. హసన్‌పర్తి మండలంలోని నాగారం పెద్ద చెరువులో ఎమ్మెల్యే ఆదివారం చెరువులో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలు పంపిణీ చేయడం వల్ల మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నయని పేర్కొన్నారు. గడపగడపకూ సంక్షేమ పథకాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని సూచించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రేణుకుంట్ల సునీతాప్రసాద్, మత్స్యపారిశ్రామిక సంఘం జిల్లా అధ్యక్షుడు బుస్స మల్లేశం, నాగారం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు దామెర రాజు, కార్యదర్శి కల్లెబోయిన మల్లయ్య, ఉపాధ్యక్షుడు తాళ్ల నర్సయ్య, డైరెక్టర్లు కులశేఖర్, రావుల సమ్మయ్య, రావుల సృజన్, కుమార్, ముల్కపల్లి రఘుపతి, మౌటం భిక్షపతి, హసన్‌పర్తి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు పిట్లల కుమారస్వామి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెసరు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ అరుణ్‌కుమార్, ఎంపీటీసీ గౌరు సుమతి తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి పరామర్శ
గ్రేటర్ ఒకటో డివిజన్ ముచ్చర్లలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) గ్రామ మాజీ అధ్యక్షుడు మట్టెడ రమేశ్ ప్రథమ వర్ధంతి ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై మట్టెడ రమేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట గ్రామ అధ్యక్షుడు సూర ప్రమోద్యాదవ్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు.
గ్రామాల రూపురేఖలు మార్చినం
మడికొండ : టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ప్రభుత్వం గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించి రూపురేఖలు మార్చినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 45వ డివిజన్ తరాలపల్లి, కుమ్మరిగూడెంలో రూ. 2కోట్ల 50 లక్షలతో చేపట్టిన బీటీ రోడ్డు, సుమారు రూ. 50 లక్షలతో నిర్మించే సీసీరోడ్లు, సైడ్ డ్రైన్ పనులను ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కుమ్మరిగూడెం ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామానికి చెందిన సుమారు 50 మంది యువకులు వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వీరికి ఎమ్మెల్యే అరూరి రమేశ్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరాలపల్లి నుంచి కమ్మరిగూడెం వరకు రోడ్డు పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. గతంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ వచ్చినంక గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. శ్మశానవాటికలో వసతులు కల్పించాలని గ్రామస్తులు కోరగా కొటేషన్ పంపించాలని వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి ప్రతి ఒకరు కృషి చేయాలని ఆయన సూచించారు.
విజేతలకు కప్ అందజేత
కడిపికొండలో నిర్వహించిన కడిపికొండ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ముగింపు పోటీలకు ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గెలుపొందిన జట్టుకు కప్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, క్రీడల్లో గెలుపోటములు సహజమని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు మధుసూదన్‌రెడ్డి, కర్ర హరీశ్‌రెడ్డి, బసె కృష్ణ, బొమ్మినేని రాంచంద్రారెడ్డి, నూటెంకి సతీశ్, సంపత్‌రెడ్డి, రవి, మహేందర్, వెంకటస్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు.