నల్లబెల్లి, సెప్టెంబర్ 28: ముదిరాజ్‌ల అభ్యున్నతి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీపీ ఊడుగుల సునీత అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద చెరువు, గుట్ట చెరువు, రేగులకుంట, కొండైల్పల్లెలోని వల్లి చెరువులకు రూ. 1,12,500 విలువైన 37 వేల చేప పిల్లలను మంజూరు చేసింది. ఈ మేరకు చేప పిల్లలను ఎంపీపీ బుధవారం చెరువుల్లో వదిలారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కులవృత్తులను పట్టించుకోలేదన్నారు.
దీంతో ఆదరణ కరువై తెలంగాణలో మత్స్య సంపద కుంటుపడిందన్నారు. మత్స్యకారులు పని కరువై వారి కుటుంబాలు దుర్భర జీవితాలు గడిపారన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో మత్స్యకారుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం కేసీఆర్ మత్స్య సొసైటీలను ఏర్పాటు చేసి ఉచితంగా చేపపిల్లలు అందిస్తున్నారని వివరించారు. అలాగే, మత్స్యకారులకు బైక్‌లు, వాహనాలు అందించడంతోపాటు గ్రామాల్లో చెరువులపై ముదిరాజ్‌లకు హక్కు కల్పిస్తూ ప్రత్యేక చట్టం తీసుకురావడం శుభ పరిణామమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, సర్పంచ్ నానెబోయిన రాజారాం, మత్స్య సొసైటీ మండల అధ్యక్షుడు దామ సాంబయ్య, గ్రామ అధ్యక్షుడు పాండవుల రాంబాబు, ఉపసర్పంచ్ నాగేశ్వర్రావు, పిట్టల ప్రవీణ్ పాల్గొన్నారు.
దుగ్గొండి: మత్య్స కార్మికుల ఆర్థిక ప్రగతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తిమ్మంపేట సర్పంచ్ మోడెం విద్యాసాగర్‌గౌడ్ అన్నారు. మండలంలోని గుండం చెరువు, దామెర చెరువుతోపాటు మరో 8 కుంటల్లో 2,59,500 చేపపిల్లలను సర్పంచ్ ముదిరాజ్ సంఘం బాధ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి చెరువుల్లో వదలారు. ముదిరాజ్‌ల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వందశాతం సబ్సిడీపై చేపపిల్లలను అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కత్తి ఏకాంబ్రం, వార్డు మెంబర్లు తెప్ప శంకర్, దండు రవి, దండు నర్సయ్య, గాలి సంపత్, దండు సాంబయ్య, మేక రాజు, తెప్ప రాంబాబు, దండు మల్లేశం, దండు సదయ్య, సోనబోయిన రాజు, దండు రవి, దండు రాజు పాల్గొన్నారు.