వర్ధన్నపేట, సెప్టెంబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు అని జడ్పీటీసీ మార్గం భిక్షపతి అన్నారు. గిరిజనులకు 7 నుంచి 10 శాతానికి రిజర్వేషన్ పెంచుతామని సీఎం ప్రకటించడంతో వర్ధన్నపేటలోని అంబేద్కర్ సెంటర్లో గిరిజన సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మాట్లాడుతూ గతంలో ఏ పాలకులూ గిరిజనుల సమస్యలను పట్టించుకున్న పాపానపోలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతోపాటుగా పేద వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, దేవస్థాన చైర్మన్ వేణుగోపాల్, ఎస్టీసెల్ మండల అధ్యక్షుడు భూక్యా తిరుపతి, ఎంపీటీసీ గుగులోత్ అనసూయ, సర్పంచ్ భూక్యా సరోజన, మాజీ ఎంపీటీసీ వసంత్‌నాయక్, రాజేందర్రాథోడ్, మైబూ, చందులాల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
ఊరూరా క్షీరాభిషేకాలు..
రాయపర్తి: మండలవ్యాప్తంగా సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్‌ను పది శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో తండాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. రాయపర్తి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ సారథ్యంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్ల సుధీర్‌రెడ్డి, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు కేసీఆర్, ఎర్రబెల్లి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం స్థానికులు, ప్రయాణికులకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమాలలో నాయకులు పూస మధు, గారె నర్సయ్య, నేతావత్ కిషన్‌నాయక్, దేదావత్ వెంకన్ననాయక్, మునావత్ మాంజ్యానాయక్, భూక్యా భద్రూనాయక్, మాలోత్ వసుందర్నాయక్, గుగులోత్ భోజ్యానాయక్, మేఘ్యానాయక్, జగన్నాయక్, ఉస్మాన్, ఉబ్బని సింహాద్రి, గుగులోత్ రవినాయక్, బల్లెం యాదగిరి, చందు రామ్‌యాదవ్, సతీశ్‌యాదవ్ పాల్గొన్నారు.
గిరిజనుల పాలిట దేవుడు..
కాశీబుగ్గ: గిరిజనులకు పది శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టాలు, గిరిజనబంధు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ తమ పాలిట దేవుడని తెలంగాణ ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేతిరి రాజశేఖర్ అన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఎదుట సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు ఆయన పాలాభిషేకం చేశారు. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ తమను గుర్తించిన కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. మోదీ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమ రిజర్వేషన్‌ను ఆమోదించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఓని భాస్కర్, మాజీ జడ్పీటీసీ తూర్పాటి సారయ్య, ఎరుకల సంఘం నాయకులు లోకిని సమ్మయ్య, మానుపాటి రమేశ్, పల్లకొండ ప్రభాకర్, కేతిరి సమ్మక్క, సాంబశివుడు, బిజిలి ప్రశాంత్, కేతిరి సంతోష్‌కుమార్, పులిచేరి సురేశ్, రాజు, శ్రీనివాస్, భూక్యా శంకర్‌నాయక్, పల్లకొండ ప్రమీల, ఓని రమేశ్, భిక్షపతి పాల్గొన్నారు.
గిరిజన బాంధవుడు.. కేసీఆర్
వరంగల్‌చౌరస్తా: మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వరంగల్ రైల్వేస్టేషన్ జంక్షన్లో యూనియన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మడికొండ బాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ్ హాజరై సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రాథమిక హక్కులు కల్పిస్తూ ప్రజాస్వామిక పద్ధతిలో దేశాన్ని పరిపాలించుకోవడానికి రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్మించిన నూతన సచివాలయానికి ఖరారు చేయడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీలు, బంజారాలను గుర్తించి వారికి హైదరాబాద్‌లో భవన నిర్మాణాలు చేపట్టి, 10 శాతం రిజర్వేషన్లను కల్పించడంతోపాటు త్వరలో గిరిజన బంధు కార్యక్రమాన్ని సైతం చేపడుతామని ప్రకటించి ఆదివాసీ, గిరిజన బాంధవుడయ్యారని కొనియాడారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజల మద్దతు ఎల్లవేళలా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు దేవర మల్లేశ్, ప్రధాన కార్యదర్శి మంద శ్రీనివాసరెడ్డి, ఎండీ అంకుషావళి, ఉమ్మడి జిల్లా ప్రతినిధులు ఎండీ ఖాజా, పసునూరి బాబు, గుండా రమేశ్, బొల్లం సంజీవ, పిట్ట ప్రకాశ్, బానోత్ శ్రీను, శంకర్, భద్రయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
దళితుల సంబురాలు
సంగెం: హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరుపై హర్షం వ్యక్తం చేస్తూ మండలకేంద్రంతోపాటు తీగరాజుపల్లిలో మండలంలోని దళిత ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, దళితనేత పసునూరి సారంగపాణి మాట్లాడుతూ దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామన్నారు. నిరుపేదలకు ‘దళితబంధు’ ఇచ్చి ఆర్థికంగా ఆదుకుంటున్న మహానుభావుడు అని కొనియాడారు. కార్యక్రమంలో దళిత ప్రజాప్రతినిధులు, నాయకులు ముత్యాల భానుప్రకాశ్, బాబు, మల్లయ్య, పోతుల ప్రభాకర్, బీచ్చానాయక్, మామిడాల దర్శన్, పొడేటి ప్రశాంత్, బల్సుకూరి రాజు, బందెల రమేశ్‌బాబు పాల్గొన్నారు.