గిర్మాజీపేట, సెప్టెంబర్ 16 : వరంగల్ చౌరస్తాలోని కాసం పుల్లయ్య వెడ్డింగ్ మాల్, పిన్నావారి వీధిలోని కాసం పుల్లయ్య బాంబే క్లాత్స్టోర్ సంయుక్తంగా ‘దసరావళి’ బంపర్డ్రా నిర్వహిస్తున్నాయి.
మొదటి రోజు శుక్రవారం 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పనానవీన్, కాసం పుల్లయ్య షాపింగ్ యాజమాన్యం కాసం మల్లికార్జున్, కాసం నమఃశ్శివాయ, కాసం కేదారినాథ్, కాసం శివప్రసాద్, ప్రణీత్, సాయికృష్ణ, రాహుల్, శ్రావణ్, అఖిల్ సమక్షంలో డ్రా తీశారు. కూపన్ నంబర్ G254100871074ను కలిగిన పర్వీన్సుల్తానా మొదటి డ్రాలో బైక్ గెలుచుకున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కార్యక్రమంలో కే లావణ్య, కే రజిత, గణేశ్, సిబ్బంది పాల్గొన్నారు.