వరంగల్‌చౌరస్తా/నర్సంపేటరూరల్/నెక్కొండ/నర్సంపేట, సెప్టెంబర్ 16: దళిత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని దళిత సంఘాల నాయకులు అన్నారు. హైదరాబాద్‌లో నిర్మించిన నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి అంబేద్కర్, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇందులో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్లో స్థానిక టీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్, సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
స్థానిక నాయకుడు కొమ్ము శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మండలంలోని రామవరం జీపీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ల ఫోరం నర్సంపేట మండల అధ్యక్షుడు కొడారి రవన్న ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఉప సర్పంచ్ జినుకల విమల, వార్డు సభ్యులు వడ్లకొండ కిషన్, నాసు సురేష్, బాబు, చేరాలు, మురళి, జినుకల శంకర్ పాల్గొన్నారు.
అలాగే, ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆరెపెల్లి బాబు నర్సంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఎమ్మార్పీఎస్ టీఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చిలపాక బాబు, యాకూబ్, బరిగెల ఐలయ్య, నల్ల రవి, మందుల రాజు, స్వామి, నవీన్ పాల్గొన్నారు. నెక్కొండలో మాల కుల సంఘం ఆధ్వర్యంలో సీఏం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
మాల కుల సంఘం నెక్కొండ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, నాయకులు ఉల్లేరావు ప్రభాకర్, కృష్ణ, ముడుసు రమేశ్, రవిబాబు, హరి, సాంబరాజు, రాహుల్, వీరేశ్, శ్యామ్ పాల్గొన్నారు. అంతేకాకుండా నెక్కొండలో దళిత సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మాదిగ హక్కుల దండోర రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదునూరి యాకయ్య, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఈదునూరి యాకూబ్, జిల్లా కార్యదర్శి ఈదునూరి వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ టీఎస్ పార్లమెంట్ ఇన్‌న్‌చార్జి వడ్లూరి కుమార్, జిల్లా నాయకులు టీ యాకయ్య, కందిక వెంకటేశ్వర్లు, కందిక వెంకన్న పాల్గొన్నారు.
నల్లబెల్లి/రాయపర్తి: నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నల్లబెల్లిలోని బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీటీసీ జన్ను జయరావ్ ఆధ్వర్యంలో దళిత సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పరికి రత్నం, కోయల కన్నయ్య, కనకం తరుణ్ పాల్గొన్నారు. రాయపర్తిలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు మాదిగ జేఏసీ మండలాధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ నేతృత్వంలో పలు సంఘాల కార్యకర్తలు పాలాభిషేకం చేశారు.
కార్యకర్తలు గోవింద్‌నాయక్, సన్నూరు మహేందర్, గూడెల్లి ఉప్పలయ్య, శ్రీను, మహేందర్, వెంకటేశ్, పాపయ్య, రాజు, సుమన్, ఎల్లన్న, రామయ్య పాల్గొన్నారు. కరీమాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని కరీమాబాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మల్ల అంబేద్కర్ అన్నారు. కరీమాబాద్‌లోని అంబేద్కర్ భవన్ వద్ద కరీమాబాద్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొమ్మల్ల అంబేద్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం మహనీయుడిని గుర్తించిందన్నారు. కుమార్, మహేందర్, మల్లేశం, రాజమణి, రాజు, భాస్కర్, నరేందర్ పాల్గొన్నారు.