హనుమకొండ, సెప్టెంబర్ 14 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు వడివడిగా కదులుతున్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో నిర్వహించే ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, టీఆర్ఎస్ ఇన్చార్జిలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో వేర్వేరుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి విజయవంతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో వజ్రోత్సవాలను వైభవంగా జరుపాలని ఆదేశించారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఈ నెల 16, 17, 18 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎం పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, సీపీ, ఎస్పీలు అధికారులు, టీఆర్ఎస్ ఇన్చార్జిలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో వేర్వేరుగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి విజయవంతం చేసేందుకు దిశానిర్దేశం చేశారు. మం త్రుల ఆదేశాలతో జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా సమీక్షలు జరిగాయి.
సీఎం కేసీఆర్, మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ ఆదేశానుసారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు మూడు రోజుల కార్యక్రమాల నిర్వహణపై పూర్తి స్థాయి దృష్టిసారించారు. తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులను మంత్రులు ఆదేశించారు. అలాగే, ప్రజాప్రతినిధులు మొత్తం ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని, ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పరస్పర సమన్వయం తో కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 16న ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.
నాటి తెలంగాణ చరిత్ర, నేటి తెలంగాణ సా ధించిన ప్రగతిని ఈ సందర్భంగా వివరించాలన్నారు. సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి, వివిధ కళారూపాలను ప్రదర్శించి, తెలంగాణ పూర్వ, ప్రస్తుత వై భవాన్ని చాటాలన్నారు. 17న జిల్లా కేంద్రాల్లో జాతీ య జెండాలు ఆవిషరించి, ముఖ్య అతిథుల ప్రసంగాలు చేయాలన్నారు. ఈ ప్రసంగాల్లో సైతం తెలంగాణ వైభవాన్ని చాటే విధంగా అంశాలు ఉండాలని చెప్పారు. అలాగే, అదేరోజు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ ఆదివాసీ, గిరిజనుల ఆత్మ గౌరవ భవనాలను ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమాలకు ప్రజలు, ఆదివాసీలు, గిరిజనులను భారీ ఎత్తున తరలించాలని పేర్కొన్నారు. 18న జిల్లా కేంద్రాల్లో పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వాతంత్య్ర సమర యోధులు, వారి కుటుంబ సభ్యులు, కవులు, కళాకారులను సన్మానించాలని కోరారు.
ప్రజాప్రతినిధులు, శ్రేణులకు దిశానిర్దేశం
పార్టీ ప్రజాప్రతినిధులు, శ్రేణులు కూడా ప్రజలతో కలిసి ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ ఆదేశించారు. ఈ మేరకు స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో వేర్వేరుగా మంత్రులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాలు ఒక పండుగలా జరుగాలని, అందుకు ప్రజలను విరివిగా భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అటు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నియోజకవర్గ ఇన్చార్జిలు వీరే..
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల విజయవంతానికి నియోజకవర్గాల వారీగా ఇన్చార్జిలను నియమించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మెట్టు శ్రీనివాస్, స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఇన్చార్జిగా జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి, వరంగల్ తూర్పు ఇన్చార్జిగా కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఇన్చార్జిగా నగర మేయర్ గుండు సుధారాణి, పరకాల ఇన్చార్జిగా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, నర్సంపేట ఇన్చార్జిగా ఎమ్మెల్సీ బండా ప్రకాశ్, వర్ధన్నపేట ఇన్చార్జిగా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, మహబూబాబాద్ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, ములుగు ఇన్చార్జిగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, రెడ్కో చైర్మన్ వై సతీశ్‌రెడ్డి, భూపాలపల్లి ఇన్చార్జిగా వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, డోర్నకల్ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, హుస్నాబాద్ ఇన్చార్జిగా రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్‌కుమార్‌ను నియమించినట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.