నర్సంపేట/పర్వతగిరి/చెన్నారావుపేట/ఖానాపురం/రాయపర్తి/ఖిలావరంగల్, సెప్టెంబర్ 14: హిందీ దివస్ వేడుకలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. నర్సంపేటలోని విజ్డమ్ హైస్కూల్లో జరిగిన సదస్సులో పాఠశాల డైరెక్టర్ జావెద్ మాట్లాడుతూ జాతీయ భాష అయిన హిందీని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జహంగీర్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాశ్, ఇన్చార్జి రహీమొద్దీన్, ఇలియాస్, రియాజ్, ఫర్జానా, యాస్మిన్, వీరభద్రయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలంలోని కొంకపాక జడ్పీహెచ్ఎస్లో హెచ్ఎం నెల్లుట్ల ప్రేమ్ ప్రసాదరావు అధ్యక్షతన హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుడు ఓదెల సతీశ్‌కుమార్ సమన్వయకర్తగా వ్యవహరించారు.
అనంతరం విద్యార్థులకు హిందీ కవితలు, పాటల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విశ్వనాథశర్మ, వెంకట్రాంనర్సయ్య, కృష్ణమూర్తి, కోతుల కుమారస్వామి, విశ్వనాథం, వెంకటేశ్వర్లు, రవీణ, లలిత, మమత పాల్గొన్నారు. యోగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు సర్పంచ్ వర్కాల రమేశ్, ఎంపీటీసీ కర్మిళ్ల మోహన్‌రావు, ఉపసర్పంచ్ రంజిత్‌కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ లింగయ్య ప్రశంసాపత్రాలు అందించారు. చెన్నారావుపేటలోని సిద్ధార్థ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ కంది గోపాల్‌రెడ్డి పాల్గొని విద్యార్థులకు హిందీ భాష ప్రాధాన్యంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. హెచ్ఎం కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు బొనగాల రమేశ్, కుమారస్వామి పాల్గొన్నారు.
ఖానాపురం మండలం మంగళవారిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎం కీర్య మాట్లాడుతూ హిందీ నేర్చుకోవడం వల్ల దేశంలో ఎక్కడికైనా వెళ్లగలుగుతామన్నారు. అనంతరం వేషధారణలతో ఆకట్టుకున్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు సబియా, సుధాకర్, రమేశ్, సురేందర్ పాల్గొన్నారు. రాయపర్తిలోని జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు వ్యాసరచన, గేయాలాపన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అనంతరం పాఠశాల హిందీ పండిట్ గుగులోత్ సునీతను హెచ్ఎం అజ్మీరా ఉమాదేవి నేతృత్వంలో ఉపాధ్యాయులు సన్మానించారు. టీచర్లు రావుల భాస్కర్‌రావు, వీరభద్రశర్మ, ప్రవీణ్‌రెడ్డి, రోజారాణి, మమత, రోహిణిదేవి, నవమణి, దేవేందర్, ప్రభాకర్, విక్రమాచార్యులు, ఉమాదేవి, శోభ పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ గాడిపల్లిలోని జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు హిందీ పండిట్ జీ రమేశ్ డిక్షనరీలను ఉచితంగా పంపిణీ చేశారు. హెచ్ఎం ప్రవీణ్‌కుమార్, ఎస్ఎంసీ చైర్మన్ భాస్కర్, ఉపాధ్యాయులు పాపిరెడ్డి, కృష్ణవేణి, ఫణి, సుదీర్‌బాబు పాల్గొన్నారు.