నల్లబెల్లి/సంగెం, సెప్టెంబర్ 14: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వారోత్సవాలను నల్లబెల్లి మండలవ్యాప్తంగా జయప్రదం చేద్దామని ఎంపీపీ ఊడుగుల సునీతా ప్రవీణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్య వారోత్సవాలు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసోత్సవాలు, నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీపై నల్లబెల్లిలోని రైతు వేదికలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేలా గ్రామాల్లో చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో తాసిల్దార్ దూలం మంజుల, ఎంపీడీవో విజయ్‌కుమార్, వైద్యాధికారి శశికుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, హెచ్ఎం రామస్వామి, సర్పంచ్ నానెబోయిన రాజారాం పాల్గొన్నారు. సంగెం మండల పరిషత్ కార్యాలయంలో వజ్రోత్సవాల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ కందకట్ల కళావతి మాట్లాడుతూ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 16, 17, 18న విధిగా జాతీయ జెండాలను ఆవిష్కరించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. జడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, ఎంపీడీవో ఎన్ మల్లేశం, ఎంపీవో కొమురయ్య, డీటీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.
సమన్వయంతో ముందుకు సాగాలి
పర్వతగిరి/నెక్కొండ: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగాలని జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్ కోరారు. 16న వర్ధన్నపేటలో నిర్వహించే ర్యాలీలో మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్‌కుమార్‌గౌడ్, రాములు, సర్వర్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, యుగేంధర్‌రావు, శ్రీనివాస్, మేరుగు వెంకన్న, సర్పంచ్ వెంకన్ననాయక్ పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ నెక్కొండలో ఎంపీపీ జాటోత్ రమేశ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 16న నర్సంపేటలో నిర్వహించనున్న ర్యాలీలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని రమేశ్ కోరారు. జడ్పీటీసీ లావుడ్యా సరోజనా హరికిషన్, తహసీల్దార్ డీఎస్ వెంకన్న, మండల ప్రత్యేక అధికారి ఉషాదయాళ్, సీఐ హథీరాం, ఎస్సై సీమ ఫర్హీన్, ఇన్చార్జి ఎంపీడీవో రవి పాల్గొన్నారు.