నర్సంపేట, మార్చి 3: గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. నర్సంపేట పట్టణంలోని మూడో వార్డుకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే పెద్ది వారికి క్యాంపు కార్యాలయ ఆవరణలో గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు. అనంతరం సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ పార్టీ చేయలేని విధంగా టీఆర్ఎస్ సర్కారు తెలంగాణను అభివృద్ధి చేస్తున్నదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా ఉపయోగ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. సీఎం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద సంఖ్యలో ప్రజలు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, బీరం నాగిరెడ్డి, గోనె యువరాజు, కవిత పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో గోనెల కరుణాకర్, భిక్షపతి, శ్రీనివాస్, రాజు, ప్రవీణ్, విక్రమ్, శోభన్, అశోక్ ఉన్నారు.
ఖానాపురం: నర్సంపేటను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని సొసైటీ కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేటలో శనివారం 250 పడకల దవాఖానకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. దవాఖానకు 244 పోస్టులు మంజూరు చేయించినట్లు తెలిపారు. 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా అందించేందుకు టీ హబ్ మంజూరైనట్లు వెల్లడించారు. అనంతరం పెద్ది సమక్షంలో బుధరావుపేటలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ గ్రామ అధ్యక్షుడు చెడుపాక విక్రం, బుర్ర రాజు ఆధ్వర్యంలో 40 మంది ఉన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, సర్పంచ్ కాస ప్రవీణ్‌కుమార్, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ మస్తాన్, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ, ఆర్బీఎస్ తుంగబంధం కన్వీనర్ వేజళ్ల కిషన్‌రావు పాల్గొన్నారు.
నల్లబెల్లి: నియోజకవర్గ ప్రజలకు కార్పొరేట్‌స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు నర్సంపేటలోని ప్రభుత్వ దవాఖానను 250 పడకలకు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యలయంలో పార్టీ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఈ నెల 5న నియోజకవర్గంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పర్యటన ఉన్నందున మండలం నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, తేజావత్ సమ్మయ్యనాయక్, పీఏసీఎస్ చైర్మన్ చెట్టుపెల్లి మురళీధర్‌రావు, గందె శ్రీనివాస్‌గుప్తా, హింగ్లీ శివాజీ, చిట్యాల సీతారాంరెడ్డి పాల్గొన్నారు.
నర్సంపేట: మహిళా బంధు పేరుతో మహిళా దినోత్సవం సందర్భంగా మూడు రోజులపాటు సంబురాలు ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో మహిళల కోసం చేపట్టిన సంక్షేమ, రక్షణ, అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో సంబురాలకు టీఆర్ఎస్ పిలుపునిచ్చిందన్నారు. 6న కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టడం, పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, ప్రతిభ కలిగిన విద్యార్థినులు, ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, స్వయం సహాయక సంఘాల నాయకులకు సన్మానాలు ఉంటాయన్నారు. కేసీఆర్ కిట్, షాదీముబారక్, థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారాలతో మానవహారాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. 7న కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఒంటరి మహిళ, బీడీ కార్మికుల ఫించన్లు పొందుతున్న లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కలువడం, వీలైతే వారికి స్వీట్లు, చీరెలు, గాజులు పంపిణీ వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. పార్టీ పంపించే కరపత్రం కాపీని ప్రింట్ చేసి ప్రతి గ్రామంలో పంపిణీ చేయాలని వివరించారు. లబ్ధిదారులతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని కోరారు. 8న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో సమావేశం, మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కోరారు.