PAK vs NAM | ఫర్హాన్ శతకమోత.. సూపర్ 8లో పాకిస్థాన్..!
PAK vs NAM : పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు చేతిలో కంగుతిన్న పాకిస్థాన్ నాకౌట్ ఆశల్ని నిలబెట్టుకుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై భారీ స్కోర్ చేసిన పాక్ సునాయస విజయంతో సూపర్ 8కు దూసుకెళ్లింది.
PAK vs NAM : పొట్టి ప్రపంచకప్‌లో భారత జట్టు చేతిలో కంగుతిన్న పాకిస్థాన్ నాకౌట్ ఆశల్ని నిలబెట్టుకుంది. చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాపై భారీ స్కోర్ చేసిన పాక్ సునాయస విజయంతో సూపర్ 8కు దూసుకెళ్లింది. ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(100) సెంచరీతో కదం తొక్కగా.. ఉస్మాన్ తారీఖ్(4-16), షాదాబ్ ఖాన్(3-19)లు వికెట్ల వేటతో చెలరేగాడు. 200 పరుగుల ఛేదనలో పసికూనను పడగొట్టింది. నాకౌట్ దశలో ఆతిథ్య శ్రీలంక, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లతో అమీతుమీకి సిద్ధమైంది.
తొమ్మిదో సీజన్లో గ్రూప్ దశలోనే వెనుదిరిగిన పాకిస్థాన్ ఈసారి బతికిపోయింది. గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్‌లో నమీబియాను ఓడించి సూపర్ 8కు అర్హత సాధించింది. ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(100) మెరుపు సెంచరీకి.. మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారీఖ్(4-16) మ్యాజిక్ తోడవ్వగా 102 పరుగుల తేడాతో నమీబియాను మట్టికరిపించింది పాక్. దాంతో, గ్రూప్ ఏ నుంచి సూపర్ 8 బెర్తు పట్టేసింది. పాక్ గెలుపొందడంతో రెండోసారి నాకౌట్లో ఆడాలనుకున్న యూఎస్ఏ ఆశలు ఆవిరయ్యాయి.
Pakistan become the final team to confirm their spot in the Super Eights ✅ 🇵🇰 pic.twitter.com/Mm3a1PEBy1
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2026
స్పిన్నర్లు పడగొట్టారు
పాక్‌కు భారీ స్కోర్ సమర్పించుకున్న నమీబియా భారీ ఛేదనలో ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. ఓపెనర్లు లౌరెన్ స్టీన్కాంప్(23), జన్ ఫ్రైలింక్(9)లు దూకుడగా ఆడారు. కానీ, సల్మాన్ మిర్జా ఈ జోడీని బ్రేకిచ్చాడు. ఆ తర్వాత బంతి అందుకున్న ఉస్మాన్ తారీఖ్(4-16), షాదాబ్ ఖాన్(3-19)లు వికెట్ల వేటతో ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించారు. వీరిద్దరి విజృంభణతో అలెగ్జాండర్ వొల్స్చెంక్(20) మినహా మిడిలార్డర్లో ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేదు. చివరి బ్యాటర్‌ను తారీఖ్ ఔట్ చేయగా నమీబియా 97 పరుగులకే ఆలౌటయ్యింది. దాంతో.. 102 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన పాక్ సూపర్ 8కు క్వాలిఫై అయింది.
Sahibzada Farhan enjoyed that 🎉 pic.twitter.com/9WfXR2ECPH
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2026
బౌండరీలతో విధ్వంసం
టీమిండియాపై సున్నాకై ఔటైన ఓపెనర్ షహిబ్జద ఫర్హాన్(100 :58 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లు) నమీబియాపై చెలరేగిపోయాడు. సయీం ఆయూబ్(14) విఫలమైనా.. దూకుడే మంత్రగా బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు ఫర్హాన్. చివరి ఓవర్ వరకూ నిలబడి సెంచరీతో జట్టుకు కొండంత స్కోర్ అందించాడు. సల్మాన్ అఘా(38), షాదాబ్ ఖాన్(36 నాటౌట్)లు సైతం రాణించగా 3 వికెట్ల నష్టానికి పాక్ నిర్ణీత ఓవర్లలో 199 పరుగులు చేసింది. వరల్డ్‌కప్ చరిత్రలో మూడో అత్యధిక స్కోర్‌తో నమీబియాకు సవాల్ విసిరింది సల్మాన్ అఘా సేన.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

