Uttar Pradesh | రైల్వే స్టేషన్‌పై డెకొరేటివ్ డ్రోమ్.. నమాజ్ చేసిన ముస్లింలు.. రాత్రికిరాత్రే తొలగింపు
Uttar Pradesh : పిప్రాయిచ్ రైల్వే స్టేషన్ పైభాగంలో మధ్యలో ఒక డెకొరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా.. అది గ్రీన్ కలర్లో ఉండటంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు.
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్, గోరఖ్‌పూర్ పరిధిలో వివాదాదస్పద ఘటన జరిగింది. పిప్రాయిచ్ రైల్వే స్టేషన్ పైభాగంలో మధ్యలో ఒక డెకొరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా.. అది గ్రీన్ కలర్లో ఉండటంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీంతో ఈ అంశంపై స్తానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు ఈ అంశం వివాదాదస్పదంగా మారింది.
గోరఖ్‌పూర్ కంటోన్మెంట్-పనియాహ్వా మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. చాలా చోట్ల స్టేషన్ బిల్డింగ్స్, ప్లాట్‌ఫామ్స్ వంటివి కూల్చేసి, కొత్తవి కడుతున్నారు. దీనిలో భాగంగా వారణాసి డివిజన్, పిప్రాయిచ్ స్టేషన్ పరిధిలో పాత బిల్డింగ్ కూల్చి, కొత్తగా ఒక బిల్డింగ్ కడుతున్నారు. ఈ బిల్డింగ్‌పై అలంకరణ కోసం ఒక డోమ్‌లాంటి నిర్మాణం చేపట్టారు. దీని పైభాగంలో గ్రీన్ కలర్లో షీట్ ఏర్పాటు చేశారు. దీంతో ఇది చూడటానికి అచ్చం మసీద్లాగా కనిపించింది. అంతే.. ఇటీవల కొందరు దీని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు. దీనిపై స్థానికులు కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు.
మీడియాలో వార్తలు రావడం, స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రైల్వే అధికారులు వేగంగా స్పందించారు. రాత్రిపూట ఆ డోమ్ తొలగించారు. దీంతో వివాదం దాదాపు సద్దుమణిగింది. అయితే, అసలు ఇక్కడ మసీదుపైన ఉండే డోమ్ లాంటి నిర్మాణం చేపట్టింది ఎవరు.. దీనికి అనుమతులిచ్చింది ఎవరు అనే అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

