రాయపర్తి, మార్చి 3: మండలంలోని అన్ని గ్రామాల్లో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్ అధ్యక్షతన వేసవికాలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరైన మాట్లాడారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మండలంలోని 39 జీపీల పరిధిలోని గ్రామాలు, పల్లెలు, గిరిజన తండాలు, దళిత కాలనీలు, ఆవాస ప్రాంతాలన్నింటికీ మిషన్ భగీరథ జలాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టి నిర్ణయాలతో ముం దుకు సాగితే తాగునీటి ఎద్దడి ఉండదన్నారు. ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, వాటర్ గ్రిడ్ల అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటస్తూ పరిస్థితులపై సమీక్షించాలని సూచించారు. తాగునీటి పైపులైన్ల మరమ్మతులు, లైన్ల పొడిగింపు, కొత్త లైన్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సర్పంచ్‌లను కోరారు. సదస్సులో ఆర్డబ్ల్యూఎస్ డీఈ వేణు, మండల ఇన్చార్జి ఏఈ ఫణీంద్ర, మిషన్ భగీరథ ఏఈ శివప్రసాద్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ చిలుక ప్రవీణ్‌కుమార్, వెంకటేశ్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు గారె నర్సయ్య, కోదాటి దయాకర్‌రావు, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, నలమాస సారయ్య, బోనగిరి ఎల్లయ్య, కందికట్ల స్వామి, అయిత రాంచందర్, నార్లాపురం రాజు, గుగులోత్ అశోక్‌నాయక్, భూక్యా మహేందర్‌నాయక్, బెట్టపల్లి రాకేశ్‌కుమార్, హేమలత, వెంకటేశ్‌నాయక్, బత్తుల నర్సయ్య, గోక రాజశేఖర్, రోజాకుమారి పాల్గొన్నారు. కాగా, 39 గ్రామాల సర్పంచ్‌లకు 12 మంది సర్పంచ్‌లు సదస్సుకు హాజరు కాలేదు. 16 మంది ఎంపీటీసీలకు కేవలం ముగ్గురే వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే సదస్సులకు ప్రజాప్రతినిధులందరూ హాజరు కావాలని ప్రజలు కోరుతున్నారు.