హనుమకొండ, మే 25: హనుమకొండ జిల్లాకు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గం పరిధిలోకి త్వరలో మరిన్ని ఐటీ కంపెనీలు రానున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ తెలిపారు. టాస్క్ కార్యాలయ ఏర్పాటులో భాగంగా బుధవారం హనుమకొండ బీఈడీ కళాశాల ఆవరణలోని భవనాన్ని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌యాదవ్, టాస్క్ సీఈవోతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను ఐటీ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. టాస్క్ అధికారులు, ఇన్చార్జి డీఆర్వో ఎం వాసుచంద్ర పాల్గొన్నారు.