వరంగల్,ఆగస్టు 20 : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను తెలంగాణలో పండుగలా నిర్వహిస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. స్వా తంత్య్ర వజ్రోత్సవాలకు గుర్తుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో రూ. 10.20 లక్షలతో ఏ ర్పాటు చేసిన జాతీయ చిహ్నం స్తూపాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మేయర్ సుధారాణి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహనీయుల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందని గుర్తు చేశారు.
నాడు అహింసా మార్గంలో మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్ధార్‌వల్లభాయ్ పటేల్ వంటి మహానీయులు దేశానికి స్వాతంత్య్రం తెస్తే వారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందన్నా రు. కేంద్రం తెలంగాణకు తీరనిఅన్యాయం చేస్తున్నదని, ఓవైపు రాష్ర్టానికి అవార్డులు ఇస్తూనే మరో వైపు మొండి వాదనలతో నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.
మన మిషన్ భగీరథ పథకానికి కేంద్రం అవార్డు ఇచ్చిందని గుర్తుచేశారు. కాళేశ్వరం అద్భుత ప్రాజెక్టు అని కేంద్రం కితాబు ఇచ్చిందని, కానీ జాతీ య హోదా ఇవ్వాలని కోరితే జవాబు ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నదని చెప్పారు. మతం పేరుతో కేం ద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, రాష్ట్రంలో మత చిచ్చు పెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నదని మండిపడ్డారు.
మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్యను మంత్రి ప్రశంసించారు. నగరాభివృద్ధి కోసం ఇద్దరూ నిరంతరం శ్రమిస్తున్నారని కితాబునిచ్చారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులు అందించారు. కార్పొరేషన్‌లోని పలు విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్నవారిని ప్రసంశ పత్రాలు, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు మరుపల్ల రవి, ఇండ్ల నాగేశ్వర్రావు, సురేశ్ జోషి, వేముల శ్రీనివాస్, లోహిత, సిద్ధం రాజు, దిడ్డి కుమారస్వామి. ఆదనపు కమిషనర్ అనీసుర్ రషీద్, డిప్యూటీ కమిషనర్ జోనా, రవీందర్‌రెడ్డి, కార్యదర్శి విజయలక్ష్మి, వింగ్ అధికారులు, ఉద్యోగులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కొడకండ్ల : స్వాతంత్య్ర సమరయోధులను గుర్తు చేసుకుంటూ, ప్రజల్లో స్ఫూర్తిని రగిలించాల్సిన సమయంలో బీజేపీ టమత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మంత్రి విమర్శించారు. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో సర్పంచ్ పసునూరి మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగవల్లుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో అభివృద్ధిని ఓర్వలేకలే బీజేపీ నాయకులు ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొడుతున్నాని మండిపడ్డారు. వ్యవసాయ మోటర్లకు కరెంటు మీటర్లు పెట్టి రైతులకు నష్టం కలిగించే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నదన్నారు.
కొడకండ్ల మండలంలో కొత్తగా 1272 మందికి పింఛన్ మంజూరైందని, రాని వారు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందించారు. కల్యాణ లక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులను సైతం పంపిణీ చేశారు. ఇక్కడ అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఎంపీపీ జ్యోతిరవీంద్రగాంధీనాయక్, జడ్పీటీసీ కేలోతు సత్తెమ్మ, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, ఎంపీటీసీ కుందూరు విజయలక్ష్మి అమరేందర్ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా సభ్యుడు సిందే రామోజీ, మండలాధ్యక్షుడు దీకొండ వెంకటేశ్వర్రావు, గాంధీనాయక్, మేటి సోమరాములు, కైరోజు సత్యనారాయణ, ఎమ్డీ ఆసిఫ్, దేశగాని సతీష్, మసురం వెంకటనారాయణ, రమేశ్, సుధీర్ రెడ్డి, ప్రేమ్‌కుమార్, కోటగిరి కుమార్, అనపురం మధు, తాళ్ల శోభన్, తీగల సందీప్, రణదీర్ పాల్గొన్నారు.
చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చినట్లుగా విద్య, వైద్యంలో సమానత్వాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాలవారికి నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్దేనన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా కార్పొరేషన్ పరిధిలో రెండు లక్షల గృహాలకు జాతీయ జెండాలను పంపిణీ చేశామన్నారు. రంగోలీ పోటీల సందర్భంగా మహిళలతో కలిసి మంత్రి ముగ్గు వేశారు. కమిషనర్ ప్రావీణ్యతో ముగ్గు వేయించారు.