భూపాలపల్లి రూరల్, ఆగస్టు 20 : వజ్రోత్సవాల్లో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్‌లో డీఆర్డీవో అధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర హాజరై మాట్లాడారు. భూపాలపల్లి జిల్లాలో నిర్వహించిన పోటీల్లో మహిళలు స్వాతంత్య్రంపై తమ మనసులో ఉన్న భావాలను ముగ్గుల ద్వారా వెల్లడించారన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి, జడ్పీ వైస్ చైర్ పర్సన్ కళ్లెపు శోభ, మున్సిపల్ ఏఈ రోజా పోటీలకు జడ్జీలుగా వ్యవహరించారు. మొదటి బహుమతి కే.ఇందు, రెండో బహుమతి సుమలత, మూడో బహుమతి కోమల అందుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పురుషోత్తం, హార్టికల్చర్ అధికారి అక్బర్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, పీడీ అర్బన్ వీ రాజేశ్వరి, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు తిరుపతమ్మ పాల్గొన్నారు.
వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సింగరేణి ఇల్లందు క్లబ్ హౌస్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఎన్సీసీ బ్యాండ్ పార్టీ ప్రదర్శన స్థానికులను ఆకట్టుకున్నది. మైనార్టీ బాలుర, జూనియర్ కళాశాల విద్యార్థులు బ్యాండ్ పార్టీలో పాల్గొనగా వారిని అదనపు కలెక్టర్ దివాకర అభినందించి బహుమతులు అందజేశారు. శిక్షణ ఇప్పించిన జిల్లా మైనార్టీ అధికారి బుర్ర సునీత, మైనార్టీ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ ఆకుతోట రజిత, కళాశాల ప్రిన్సిపాల్ తాటి వెంకటేశ్వర్లును అభినందించారు.
మొగుళ్లపల్లి : స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని సమ్మక్క-సారలమ్మ జాతర ప్రాంగణంలో మొగుళ్లపల్లి, ములుకలపల్లి, పర్లపల్లి గ్రామాల మహిళలకు శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేత కు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జోరుక సదయ్య, ఎంపీపీ యార సుజాతాసంజీవరెడ్డి, సర్పంచులు చదువు అన్నారెడ్డి, మోటె ధర్మారావు, జోరుక ప్రేమలత, ఎంపీటీసీ సభ్యులు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
మల్హర్ : మండలంలోని మల్లారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేత లకు సర్పంచ్ గోనె పద్మాశ్రీనివాసరావు బహుమతలు అందజేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ శివ, గ్రామస్తుడు రమణ పాల్గొన్నారు.
పలిమెల : మండల కేంద్రంతో పాటు లెంకలగడ్డ, మోదేడు, సర్వాయిపేట గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు, యువతులు అధిక సంఖ్యలో హాజరై పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రకాశ్‌రెడ్డి, సర్పంచులు, జవ్వాజి పుష్పలత, తోట రమాదేవి, జనగామ సమ్మక్క, చిడం నాగయ్య, ఏపీఎం రవికుమార్, సీసీ రతన్, పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, జీప సిబ్బంది పాల్గొన్నారు.
గణపురం : స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా మండలంలోని బుద్దారంలో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాగణంలో శనివారం రంగోళీ పోటీలు నిర్వహించారు. పోటీల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పాల్గొని ముగ్గులు వేశారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యకర్రమంలో గ్రామ కార్యదర్శి హేమంత్‌గౌడ్, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.
ములుగురూరల్ : భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన సమరయోధులను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంపీపీ మస్రగాని వినయ్‌కుమార్ అన్నారు. మండలంలోని జంగాలపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్యదర్శి తిరుపతి, మాజీ సర్పంచ్ శ్రీధర్, వార్డు సభ్యులు, పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్, క్యారమ్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. రాంనగర్, శివ్వాపూర్ గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వేడుకల్లో జడ్పీ కో ఆప్షన్ సభ్యురాలు వలియాబీ, సర్పంచులు ఈసం రామ్మూ ర్తి, వంక దేవేందర్, గార రమాదేవి, పంచాయతీ కారదర్శి రంజిత్, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 22వ తేదీన విజేతలకు బహుమతులు అందచేయనున్నట్లు సర్పంచ్ రామ్మూర్తి తెలిపారు.
గోవిందరావుపేట : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలతో పాటు సర్పంచ్ లావుడ్యా లక్ష్మి పాల్గొన్నారు. రాఘవపట్నంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ హన్మంతరావు, కార్యదర్శి శంకర్, వార్డు సభ్యుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.
వాజేడు : వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల ఆధ్వర్యంలో శనివారం పెద్దగొల్లగూడెం జీపీ పరిధిలో ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్యామల శారద, సర్పంచ్ జజ్జరి మేనక, ఉపసర్పంచ్ మెట్టపల్లి దేవమ్మ, కార్యదర్శి శిరీష పాల్గొన్నారు.
మహదేవపూర్(కాటారం): మండల కేంద్రంలోని రైతువేదికలో వజ్రోత్సవాల నేపథ్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, ఎంపీటీసీ మహేశ్వరీ, పంచాయతీ కార్యదర్శి షకీర్‌ఖాన్, ఐకేసీ సీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.