తొర్రూరు, ఆగస్టు 19 : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ తల్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 15 రోజుల పాటు స్వతం త్ర భారత వజ్రోత్సవాలను నిర్వహిస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాల వల్లే స్వేచ్ఛను అనుభవిస్తున్నామని, వారి ఆశయాలను సాధించేందుకు అందరూ కార్యోన్ముఖులు కావాలన్నారు. గాంధీ శాంతయుత పోరాట స్ఫూర్తితో నాటి ఉద్యమనేత, ప్రస్తుత సీఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించార ని చెప్పారు. అనాథలమని అధైర్య పడకుండా భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి మార్గదర్శకులుగా నిలువాలని ఆకాంక్షించారు.
ఎల్లవేళలా అందుబాటులో ఉండి బాసటగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. గాంధీ సినిమాను తప్పకుండా చూడాలని చిన్నారులకు చెప్పారు. కలెక్టర్ శశాంక మాట్లాడుతూ.. ఆలోచనలు గొ ప్పగా ఉండాలని సూచించారు. 2010 నుంచి పేదరికం, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను చేరదీసి ఉచిత వసతి, విద్యను అందిస్తున్న స్నేహ నివాస్ నిర్వాహకులను అభినందించారు. 36 మంది అనాథ విద్యార్థులకు సేవలందించడం గొప్ప విషయమన్నారు. వెలికట్ట ఎంపీటీసీ బత్తుల మల్లమ్మ కుమారుడు యాకయ్య అందజేసిన సబ్బులను తహసీల్దార్ రాఘవరెడ్డి విద్యార్థినులకు పంపి ణీ చేశారు. అనంతరం వజ్రోత్సవాల ఉద్దేశం, భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రపై విద్యార్థినులు తెలుగు, ఇంగ్లిష్‌లో ఇచ్చిన ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకన్నాయి.
ఫొటోగ్రఫీ ఒక అద్భుత సృజనాత్మక కళ… వేల భావాలకు ఒక ఫొటో దర్పణం పడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తొర్రూరులోని గెస్ట్‌హౌస్‌లో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల అధ్యక్షుడు సాదు సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా ఆవిష్కరణ, లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి అధ్యక్షురాలు వజినపల్లి దీప ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటోగ్రాఫర్లకు సన్మానం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పొటోగ్రఫీ నిరుద్యోగులకు ఉపాధిగా మారిందన్నారు. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఫొటోలు నిలుస్తామని చెప్పారు.
మంత్రి ఎర్రబెల్లి కాసేపు సరదాగా ఫొటోలు తీశారు. ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తి పలువురి ఫొటోలు తీసి, అందరి ముఖాల్లో నవ్వులు పూయించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో రమేశ్‌బాబు, ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, వైస్ చైర్మన్ జినుగ సురేందర్‌రెడ్డి, లయన్స్ రీజియన్ చైర్మన్ రేగూరి వెంకన్న, జోన్ చైర్మన్ ప్రతాపని వెంకటేశ్వర్లు, డాక్టర్ శారద, ప్రధాన కార్యదర్శి వజినపల్లి శైలజ, కోశాధికారి చీదర నీలిమ, తుమ్మూరి శ్రీదేవిరెడ్డి, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లూరి నాగేంద్రాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవరకొండ కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి మేరుగు కరుణాకర్, కోశాధికారి కాసర్ల రవి, సంఘ ప్రతినిధులు, బాధ్యులు మాచర్ల వెం కన్న, పైండ్ల వినయ్‌కుమార్, హరిమోహనాచారి, ఎల్లారెడ్డి, వెంకటాద్రి, మియాపురం రమాకాంత్, సాయికిర ణ్, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్రావు, వెలికట్ట సర్పంచ్ పీ పుష్పలీల, ఎంపీడీవో కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఆర్ శ్రీనివాస్, స్నేహ నివాస్ సిస్టర్ నీలోఫర్ పాల్గొన్నారు.