కరీమాబాద్, జూన్ 21: తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతిని జిల్లాలోని అన్ని గ్రామాల్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇందులో వరంగల్ ఉర్సులోని ఎస్సీకాలనీలో టీఆర్ఎస్ నాయకుడు ఈదుల రమేశ్ ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ పాల్గొని సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో సార్ పాత్ర మరువలేనిదన్నారు. కార్యక్రమంలో కలకోట్ల రమేశ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నర్సంపేట/నర్సంపేటరూరల్/వర్ధన్నపేట/ నెక్కొండ: ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నర్సంపేట పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ పిలుపునిచ్చారు. నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో సార్ పాల్గొన్నారని గుర్తుచేశారు.
రాష్ట్రం సిద్ధించిన తర్వాత పేదల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. యువత జయశంకర్ అడుగు జాడల్లో పయనించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, గుంటి కిషన్, రాయిడి రవీందర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, మచ్చిక నర్సయ్యగౌడ్, బండి రమేశ్, నాగిశెట్టి ప్రసాద్, దస్రూనాయక్, నాగిరెడ్డి, మండల శ్రీనివాస్, సారంగపాణి, పుట్టపాక కుమారస్వామి, పెండెం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నర్సంపేట మండలం రామవరంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కొడారి రవన్న సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే, ఇటుకాలపల్లి, రాజేశ్వర్రావుపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, రాజపల్లి, రాజుపేట, ముత్తోజిపేట, గురిజాల, జీజీఆర్‌పల్లి, లక్నేపల్లిలో జయశంకర్ వర్ధంతిని సర్పంచ్‌లు మండల రవీందర్, బొజ్జ యువరాజ్, వల్గుబెల్లి రంగారెడ్డి, పలకల పూలమ్మ, నామాల భాగ్యమ్మ, గోలి శ్రీనివాస్‌రెడ్డి, గొడిశాల మమత, గొడిశాల రాంబాబు, కోమల నిర్వహించారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయంలో చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ తన జీవితాన్నే అర్పించుకున్నారని తెలిపారు. సార్ మార్గదర్శనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాలు చేపట్టి రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు తుమ్మల రవీందర్, సమ్మెట సుధీర్, రామకృష్ణ, రాజమణి, మాశెట్టి సోమయ్య, అన్వర్, సత్యం పాల్గొన్నారు. నెక్కొండలోని అంబేద్కర్ కూడలిలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొనిజేటి భిక్షపతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, సొసైటీ చైర్మన్ మారం రాము, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నర్సంపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్ము రమేశ్‌యాదవ్, నాయకులు రవీందర్‌రెడ్డి, సోమయ్య, సత్యం, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. అలంకానిపేటలో సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ నర్సయ్య, కార్యదర్శి మధు, నాయకులు వెంకటేశ్వర్లు, వీరారెడ్డి , పాషా, రుషి పాల్గొని సార్‌కు నివాళులర్పించారు.
నల్లబెల్లి/చెన్నారావుపేట/ఖానాపురం/దుగ్గొండి/కాశీబుగ్గ/గీసుగొండ: ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన బాటలో పయనించాలని ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్ అన్నారు. నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయంలో జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. ఎంపీటీసీ పాలెపు రవీందర్రావు, సూపరింటెండెంట్ అబీదలీ, సర్పంచ్ నానెబోయిన రాజారాం, ఆర్మీ ఎక్స్‌సర్వీస్‌మెన్ పలకల కనకసేణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎండీ నజీమా, క్యాతం శ్రీనివాస్, నాగేశ్వర్రావు, గోనెల నరహరి, వైనాల వీరస్వామి, పరికి నవీన్, తెలంగాణ ఉద్యమకారులు భట్టు సాంబయ్య, పరికి కోర్నేల్, ప్రకాశ్, తిప్పని రవీందర్ పాల్గొన్నారు. చెన్నారావుపేటలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాల్నె వెంకన్న సార్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
ఆయన వెంట ఆర్బీఎస్ మండల కన్వీనర్ బుర్రి తిరుపతి, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, సర్పంచ్ మల్లయ్య, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల కో ఆప్షన్ గఫార్, పీఏసీఎస్ డైరెక్టర్ రాజు, మాజీ ఎంపీటీసీ కుమారస్వామి, లక్ష్మారెడ్డి, ఐల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, బొంత శీను, రాంబాబు పాల్గొన్నారు. ఖానాపురంలోని తహసీల్ కార్యాలయంలో తాసిల్దార్ జులూరి సుభాషిణి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో సుమనావాణి, సొసైటీ కార్యాలయ ఆవరణలో రైతుబంధు మండల కన్వీనర్ కుంచారపు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
దుగ్గొండి మండలం గిర్నిబావి ఎంజేపీటీ గురుకులంలో ప్రత్యేకాధికారి దేవేందర్, ఆదర్శవాణి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో రవి పాల్గొని జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, రంగారావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో కృష్ణప్రసాద్, ఎంపీవో శ్రీధర్‌గౌడ్, ఏపీఎం రాజ్‌కుమార్, ఎంజేపీటీ, కేజీబీవీ ప్రిన్సిపాళ్లు దేవేందర్, మంజుల, ఏవో దయాకర్, ఎంఈవో సత్యనారాయణ, మందపల్లి, నాచినపల్లి, మందపల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు మహిపాల్‌రెడ్డి, రాంరెడ్డి, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. కాశీబుగ్గ మార్కెట్ రోడ్డులోని సార్ విగ్రహానికి తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు బేతి రాజు ఆధ్వర్యంలో పూలమాల వేశారు. గీసుగొండ మండలం ఎలుకుర్తిలో సార్ చిత్రపటానికి రజక రిజర్వేషన్ పోరాట సమితి నేత అభిషేక్ పూలమాల వేసి నివాళులర్పించారు. నాయకులు అశోక్, తిరుపతి పాల్గొన్నారు.