తొర్రూరు, జూన్ 4: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుందని వైస్ ఎంపీపీ ఇట్టే శ్యాంసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. బడిబాటలో భాగంగా శనివారం మండలంలోని ఫత్తేపురంలో సర్పంచ్ గూడెల్లి సోమనర్సమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీహెచ్ వెంకన్నతో కలిసి స్టూడెం ట్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు మెరుగైన వసతుల కల్పన, మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు నాణ్యమైన విద్యాబోధన సౌకర్యం అందుబాటులో ఉండే లా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ‘మన ఊరు-మన బడి’ లాంటి అద్భుత కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు. మొదటి విడుతలో ఎంపిక కాని, పాఠశాలలు రెండో విడుత మన ఊరు-మన బడి కార్యక్రమలో ఎంపికవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పెద్ది మహేంద్ర, రైతు బంధు సమితి సభ్యులు గూడెళ్లి నర్సయ్య, మాజీ వార్డు సభ్యులు సండ్ర ముత్యాలు, పాఠశాల ఉపాధ్యాయులు ఎం యాకయ్య, అంగన్వాడీ వర్కర్ శైలజ పాల్గొన్నారు.
పెద్దవంగర: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించడంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని సీఆర్పీలు వేముల సంతోష్, నిరంజన్ అన్నా రు. శనివారం ఆచార్య జయశంకర్ రెండో రోజు బడిబాట కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ‘మనఊరు-మనబడి’తో సీఎం కేసీఆర్ పాఠశాలను మరింత అభివృద్ధి సాధించేలా చేయడం జరుగుతుందన్నారు. మండలంలో ఇప్పటికి 33 కొత్త ఆడ్మిషన్లు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు.
నర్సింహులపేట : బడీడు పిల్లందరిని సర్కార్ పాఠశాలల్లో చేర్పించాలని రైతుబంధు సమితి మండల కన్వీనర్, సర్పంచ్ యల్లు మధుసూదన్‌రెడ్డి కోరారు. శనివారం మండల కేంద్రంతో పాటు నర్సింహులపేట, మంగళితండాలో గెజిటెడ్ హెచ్ఎం శ్రీలతతో పాటు అన్ని గ్రామాల్లో ఉపాధ్యాయులు జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగహన కల్పించారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మరిపెడ: రాష్ట్రప్రభుత్వం ప్రభుత్వ బడుల్లో కార్పోరేట్ స్థాయిలో విద్యబోధనతో పాటు శుచితో కూడిన మధ్యా హ్న భోజనం అందిస్తున్నట్లు సీతరామపురం జిలా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు నగేశ్ అన్నారు. శనివా రం మున్సిపల్ కేంద్రంలోని వివిధ కాలనీల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల్లో మెరుగైన బోధన అందించేందుకు ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శౌరీ,ప్రేమ్ సాగర్, వెంకటరమణ, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
నెల్లికుదురు: ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదుశాతాన్ని పెంచే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రోపేసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం రెండో రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి సర్కారు బడుల్లో అందుబాటులో ఉన్న సకల సౌకర్యాలను వివరిస్తు, ఈ ఏడాది నుచి ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రాధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
డోర్నకల్: గ్రామీణ, తండాల్లో పేద విద్యార్థులకు ప్రభు త్వ బడుల్లో నాణ్యమైన విద్యా అందుతుందని సర్పంచ్ తేజావత్ గమ్మి రాజు అన్నారు. శనివారం బొడ్రాయి తండాలో యూసీఎస్ పాఠశాలలో బడి బాట కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆంగ్ల విద్యా బోధన పోటీ పరీక్షలకు ఎంతో గాను ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీ సీతారాములు, అజీ జ్, సత్యనారాయణ, వెంకటప్పయ్య, మాధవి, టీఆర్ఎస్ ఎస్టీసెల్ నాయకులు తేజావత్రాజు నాయక్ పాల్గొన్నారు.
కొత్తగూడ : బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఈవో శ్రీదేవి సూచించారు. కొత్తగూడ మండల కేంద్రంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో కొత్తగూడ, గంగారం మండలాల ప్రధానోపాధ్యాయులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఈవో మాట్లాడుతూ పాఠశాలలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని యూడైస్ ఫార్మెట్లో నమోదు చేసి, సోమవారం నాటి వరకు ఎమ్మార్సీలో అందించాలన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలని సూచించారు. బడిబాట రోజువారీ కార్యక్రమాలు చేపట్టని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.