ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : పులి రజనీకాంత్
ఈనెల 21వ తేదీన జరగనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముదిరాజుల మహాసభ ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.
హనుమకొండ చౌరస్తా, నవంబర్ 18: ఈనెల 21వ తేదీన జరగనున్న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముదిరాజుల మహాసభ ప్రధాన కార్యదర్శి పులి రజనీకాంత్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండలోని మచిలీబజార్ చేపల మార్కెట్ వద్ద ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మత్స్యకారుల హక్కులు, వారి కష్టాలు, వారి జీవన విధానం, సమాజానికి వారు అందిస్తున్న సేవలను గుర్తుచేసుకునే గొప్పరోజు ప్రపంచ మత్స్య దినోత్సవమని, మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా తెలంగాణ ముదిరాజుల మహాసభ స్థాపించి నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా ప్రతి డివిజన్లో మహాసభ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. 12 సంవత్సరాలుగా తెలంగాణ ముదిరాజుల మహాసభ ముదిరాజుల ఐక్యత, హక్కుల సాధన, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా ముదిరాజులందరూ ఐకమత్యంతో సంఘటితమై సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మధుసూదన్, పులి సదానందం, బయ్య శోభన్, కొండా అశోక్, ఇప్పచుక్కయ్య ,సదానందం, ముత్యాల శీను, కొండ కుమార్, పులి సందీప్, చెంచుల రవి, బండి మధు, కుమార్, పులి జ్యోతి, పులి కవిత, కొండ లత, కవిత పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wall Collapse | కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్.. వీడియో
Panchayat Season 5 | ఫులేరా గ్రామానికి మళ్లీ స్వాగతం.. కొత్త సీజన్‌తో రాబోతున్న ‘పంచాయత్’
PP Bribe | పెద్దపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పబ్లిక్ ప్రాసిక్యూటర్
Car Stolen With Sleeping Girl | బాలిక నిద్రిస్తున్న కారును చోరీ చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ప్రాణాలు పోతున్నా సహారా బాధితులను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

