నాయీంనగర్, ఏప్రిల్ 26: వరంగల్ అభివృద్ధి ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 56వ డివిజన్ జవహర్కాలనీలో టీఆర్ఎస్ అభ్యర్థి సిరంగి సునీల్‌కుమార్ నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు. వరంగల్ ప్రజల శేయస్సు కోసం నగరం నడిబొడ్డున రూ.130కోట్లతో అధునాతన సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నామని తెలిపారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నాయకులు వెంకన్న, సతీశ్, దూలం రాజు, రమేశ్‌గౌడ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం
భీమారం: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలివేల్పులలో గనిపాక కల్పన గెలుపునకు సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ప్రచారం చేశారు. ఓరుగల్లు సమగ్రాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమైందన్నారు. ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్పనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో ఏనుమాముల మార్కెట్ డైరెక్టర్ విజయ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.