కరీమాబాద్, ఫిబ్రవరి 3: ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అధికారులకు సూచించారు. కరీమాబాద్‌లోని దసరారోడ్డు అభివృద్ధి పనులను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. రోడ్ల విస్తరణ, నూతన రహదారుల నిర్మాణంతో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు స్థానికులు సహకరించాలని కోరారు. కాలనీల్లో రోడ్ల విస్తరణ ఆవశ్యకతను స్థానికులకు ఎమ్మెల్యే వివరించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఆయన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వరంగల్ 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి, కుడా సలహామండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, నాయకులు పల్లం రవి, నాగపురి సంజయ్‌బాబు, కోరె కృష్ణ, పొగాకు సందీప్, బీ రంజిత్, ఎం గౌతమ్, వీ కుమార్, ఏ సుధాకర్, బైరి వంశీ పాల్గొన్నారు.