కరాచీ: పాకిస్థాన్‌లోని కరాచీలో పేలుడు ఘటన జరిగింది. ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో గ్యాస్ లీకేజీ వల్ల పేలుడు(Gas Explosion) జరిగింది. ఆ ప్రమాదంలో 16 మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. కరాచీలోని సోల్జర్ బజార్ ఏరియాలో దుర్ఘటన జరిగింది. గుల్ రాణా కాలనీ ఏరియాలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. గాయపడ్డవారిని సివిల్ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున 4.15 నిమిషాలకు బిల్డింగ్ తొలి ఫ్లోర్లో గ్యాస్ లీకేజీ పేలుడు ఘటన జరిగినట్లు తెలుస్తోందని ఏఎస్పీ జెంషెడ్ అషేర్ తెలిపారు
. గ్యాస్ పేలుడు వల్ల బిల్డింగ్‌లో కొంత భాగం కూలినట్లు రెస్క్యూ టీమ్ ఆఫీసర్ డాక్టర్ అబిద్ జలాలుద్దిన్ షేక్ తెలిపారు. మూడు అంతస్తుల బిల్డింగ్‌లో చిన్న చిన్న రూమ్‌లు ఉన్నాయని, స్థలం తక్కువగా ఉన్నందు వల్ల రెస్క్యూ ఆపరేషన్ సవాల్‌గా మారినట్లు చెప్పారు. మృతుల్లో 8 మంది మైనర్లు, నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. గాయపడ్డవారిని ఏడు మంది మైనర్లు ఉన్నారు.