Navitaire | నెవిటేర్ వ్యవస్థలో సాంకేతిక లోపం.. విమాన సర్వీసులకు అంతరాయం
Navitaire | నెవిటేర్ (Navitaire) వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా యూరప్ (Europe) తోపాటు ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai) సహా దేశంలోని ఎయిర్‌పోర్టుల (Airports) లో విమాన సర్వీసుల (Flight services) కు అంతరాయం ఏర్పడింది. దాంతో వేలమంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.
Navitaire : నెవిటేర్ (Navitaire) వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా యూరప్ (Europe) తోపాటు ఢిల్లీ (Delhi), ముంబై (Mumbai) సహా దేశంలోని ఎయిర్‌పోర్టుల (Airports) లో విమాన సర్వీసుల (Flight services) కు అంతరాయం ఏర్పడింది. దాంతో వేలమంది ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. నెవిటేర్ వ్యవస్థలో దాదాపుగా 45 నిమిషాలపాటు సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ పరిస్థితి నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం 6.45 గంటల సమయంలో ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. బుకింగ్, చెక్ఇన్ కోసం ఎయిర్‌లైన్ సంస్థలు ఉపయోగించే నెవిటేర్ వ్యవస్థలో ఈ సమస్యను గుర్తించారు. గంటలోపే దానిని పరిష్కరించారు. కానీ ఈ సమయంలో సిబ్బంది బుకింగ్, చెక్ఇన్లను మాన్యువల్‌గా నిర్వహించాల్సి వచ్చింది. దాంతో రద్దీ భారీగా పెరిగింది.
ముంబయిలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఈ సాంకేతిక లోపం కారణంగా ఇండిగో, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై ప్రభావం పడింది. రిజర్వేషన్లు, చెక్ఇన్, బోర్డింగ్ కోసం కీలకమైన ఎయిర్‌లైన్ టెక్నాలజీని నెవిటేర్ అందిస్తోంది. అది విఫలమైతే ప్యాసింజర్ వివరాలను ప్రాసెస్ చేయడంలో అంతరాయం ఏర్పడుతుంది. ఇది జాప్యాలు, రద్దీకి దారితీస్తుంది.
కాగా గత నవంబర్‌లో ఢిల్లీలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్య కారణంగా 800కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయం రోజుకు 1500 విమాన సర్వీసుల్ని నిర్వహిస్తోంది. ముంబై విమానాశ్రయం నిర్వహించే సర్వీసుల సంఖ్య 1000 గా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

