న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్( AI Impact Summit) జరుగుతున్న విషయం తెలిసిందే. కృత్రిమ మేధపై జరుగుతున్న ఆ సదస్సులో ఓ అనూహ్య సన్నివేశం చోటుచేసుకున్నది. రెండు దిగ్గజ ఏఐ కంపెనీల మధ్య ఉన్న విబేధాలు స్పష్టంగా కనిపించాయి. గ్రూప్ ఫోటో కోసం వేదికపై నిలుచున్న ఏఐ ప్రతినిధులు చేతులు జోడించే సమయంలో.. రెండు కంపెనీలకు చెందిన లీడర్లు తమ చేతులను ఒకర్ని ఒకరు పట్టుకోలేదు. ప్రపంచ మీడియా ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది.
ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మ్యాన్, ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడీ .. పక్కపక్కనే నిలుచున్నా.. ఆ ఇద్దరూ తమ చేతులను పట్టుకోలేదు. దీనికి బదులుగా ఆ ఇద్దరూ పడికిలి బిగించి చేతులను పైకి ఎత్తారు. ఏఐ లీడర్లు అందరూ వరుసగా నిలబడ్డా.. ఆ ఇద్దరూ అయిష్టంగానే పక్కపక్కనే నిలుచున్నారు. కానీ చేతులను కలుపడానికి వ్యతిరేకించారు. వరుస క్రమాన్ని బ్రేక్ చేసి కేవలం పిడికిలి మాత్రమే బిగించారు. దీంతో ఆ ఘటనకు చెందిన పిక్స్, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
కృత్రిమ మేధపై పనిచేస్తున్న ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి అమడీ ఎప్పుడో వెళ్లిపోయారు. ఏఐని కమర్షలైజ్ చేస్తున్నట్లు ఆరోపించారు. భద్రతపై ఫోకస్ చేయడం లేదన్న ఉద్దేశంతో ఆ కంపెనీ వీడారు. అయితే సేఫ్ట్ ముఖ్యమన్న లక్ష్యంతో ఆంథ్రోపిక్ కంపెనీ పెట్టారు అమోడీ. ఏఐ టెక్నాలజీ అనేది కోట్లాది మంది ప్రజలకు చేరాలని ఆల్ట్‌మ్యాన్ భావిస్తున్నారు. అయితే ఇది సాధ్యం కావాలంటే .. ఓపెన్ ఏఐ తమ ఉత్పత్తులను ఎక్కువగా కమర్షలైజ్ చేయాలని ఆల్ట్‌మ్యాన్ ప్రయత్నిస్తున్నారు. సర్వీసులు అందుబాటులో ఉండాలంటే అడ్వర్టైజింగ్ అవసరమని అన్నారు. అయితే ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ మధ్య ఉన్న శత్రుత్వం ఇవాళ .. భారత మండపం వేదికపై స్పష్టంగా కనిపించింది.
ఏఐపై తీవ్ర పోటీపడుతున్న ఈ రెండు కంపెనీలు ఇటీవల కోడింగ్ టూల్స్‌ను ఆవిష్కరించాయి. కొన్ని క్షణాల వ్యవధి తేడాలోనే ఆ టూల్స్‌ను రిలీజ్ చేశాయి. తమ పోరాటం కేవలం ఐడియాలకు మాత్రమే కాదు అని, ఉత్తమ ఉత్పత్తులను నిర్మించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. అయితే ఏఐ భవిష్యత్తు కోసం కలిసి దిగ్గజ నేతలు ఒకరి చేతులను ఒకరు పట్టుకోకపోవడం శోచనీయమే అవుతుంది. ఐకమత్యానికి సంకేతంగా చేయి, చేయి పట్టుకోవాలని మోదీ కోరగా, ఏఐ లీడర్ల మధ్య ఉన్న విబేధాలు బయటపడ్డాయి. తాజాగా ఆంథ్రోపిక్ క్లాడ్ ఓపెన్ 4.6 ప్రొడెక్ట్‌ను లాంచ్ చేసింది. అయితే 20 నిమిషాల తేడాలోనే ఓపెన్ఏఐ సంస్థ జీపీటీ-5.3 కోడెక్స్‌ను ఆవిష్కరించింది. రెండు కంపెనీల మధ్య ఉన్న వైరానికి ఢిల్లీ వేదికైంది.
Sam Altman and Darioi Amodei 😭 pic.twitter.com/l4gjwmomkH
— Prayag (@theprayagtiwari) February 19, 2026