ధర్మసాగర్: స్థానిక ఎన్నికల ప్రచారంలో ఓ ఓటరు తన ఇంటికి రాసుకున్న మా ఇంటి ఓట్లు అమ్ముకొము (Vote Not For Sale) అనే విషయం గ్రామంలో ఓటర్లను ఆలోచింప జేస్తుంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో మాతంగి జైపాల్ అనే వ్యక్తి తన ఇంటి ప్రహరీ గోడకు అంబేద్కర్ చిత్రపటం గీసి మాకు అభివృద్ధి కావాలి, మా ఓట్లు అమ్ముకొము, ప్రశ్నించే హక్కును కోల్పోము అని రాసుకున్నారు.
అలాగే బీఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా.. నా దేశ ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు, ఓటు హక్కును ఆయుధంగా ఇచ్చాను, పోరాడి రాజులు ఆవుతారో- అమ్ముకుని బానిసలు ఆవుతారో మీ చేతుల్లోనే ఉందని రాసి అందరిని ఆలోచింప జేస్తున్నారు. ఈ చైతన్యం ప్రజలందరిలో రావాలని, పైసలు తీసుకొని ఓటు వేయొద్దని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.