హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 5: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్‌ను యథాతథంగా ప్రజల ముందు పెట్టకుండా తమకు అణువుగా మార్చుకున్నామని ప్రభుత్వమే మంత్రివర్గం మొత్తం కూర్చొని ప్రజలకు వివరించడం హాస్యాస్పదంగా ఉందని బీఅర్ఎస్ జిల్లా నేత వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన 655 పేజీల రిపోర్ట్‌ను తనకు నచ్చిన అధికారులను పెట్టి 65 పేజీలకు కుదించారంటే అందులో రేవంత్‌రెడ్డి హస్తముందని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రజలకు అర్థమవుతుందన్నారు.
రేవంత్‌రెడ్డికి కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడే పరిస్థితి లేదని, కేసీఆర్‌ని తిట్టడమే పనిగా పెటుకున్నారన్నారు.
పాలన చేతగాక బూతులు మాట్లాడడంతప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు, మరోవైపు కాంగ్రెస్ నేను మంత్రులు, ఎమ్మెల్యేలు కాళేశ్వరం నీటిని విడుదల చేస్తూ, కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతుండటం వారి అవివేకకానికి నిదర్శనమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయే ఉపఎన్నికల్లో లబ్ధిపొందడానికే కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్నారు. రైతులు యూరియా కొరతతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే పాలన చేతగాక ప్రకటనలతో రాజకీయం చేయడం సరికాదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్చేసి ఎన్నికల్లో లబ్ధిపొందడానికి చూస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెపుతారని వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.