Hanumakonda | ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టండి : రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం
విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలని అలాగే ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం, సీఐ రవికుమార్ అన్నారు.
హనుమకొండ చౌరస్తా, మార్చి 23: విద్యార్థులు చెడు వ్యసనాలకు చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలని అలాగే ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని కాకతీయ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం, సీఐ రవికుమార్ అన్నారు. సోమవారం ఎస్ఎఫ్ఐ కాకతీయ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో భగత్‌సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా యూనివర్సిటీ మొదటి గేటు నుంచి యూనివర్సిటీ గెస్ట్ హౌస్ వరకు 2కే వాక్ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన రిజిస్ట్రార్, సీఐ మాట్లాడుతూ విద్యార్థులు మంచి ఆలోచనలతో మెదలాలని, తప్పుడు మార్గాలను ఎంచుకోకుండా సరైన మార్గంలో నడిచి బాగా కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గాదె ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ సమాజంలో జరిగే అన్యాయాల మీద దోపిడి వ్యవస్థ మీద యూనివర్సిటీలలో చదివే విద్యార్థులు ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ ప్రశ్నించాలన్నారు. దేశస్వాతంత్రం కోసం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించారన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ కళ్యాణ్‌కుమార్, ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, కేయూ అధ్యక్ష, కార్యదర్శులు చెన్నూరి సాయికుమార్, బిరెడ్డి జస్వంత్, ఉపాధ్యక్షుడు మల్లేష్ నాగరాజ్, పవన్, సురాజ్, ఉదయ్, మధు, ఇప్ప భరత్, నరేందర్, పవన్‌కుమార్, రణదీప్, చరణ్, వివేక్, సన్నీ, రాహుల్, శ్రీకాంత్, సందీప్, సాయి, అభిషేక్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

