ఖిలావరంగల్, మార్చి 27: గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి వరంగల్ – చింతలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ధర్మారం రైల్వే గేట్ సమీపంలో జరిగింది. వరంగల్ జీఅర్పీ హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుమారు 35 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి ధర్మారం రైల్వే గేట్ సమీపంలోని మైలురాయి నెంబర్ 382/16-18 వద్ద డౌన్ లైన్‌పై వెళ్తున్న ట్రైన్ నంబర్ 12714 శాతవాహన ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బ్లూ కలర్ నైట్ ప్యాంట్, సిమెంట్ కలర్ ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు.
రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం దవాఖాన మార్చురీలో భద్రపరిచి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నాడు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అతని మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ మార్చురీ గదిలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 98497 49220, 8712658627 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.