Journalists Mahadharna | డిసెంబర్ 3న జర్నలిస్టుల సమస్యలపై మహాధర్నా.. టీయుడబ్ల్యూజే (ఐజేయూ) కరపత్రాల ఆవిష్కరణ
Journalists Mahadharna | ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 3న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన మహాధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు.
Journalists Mahadharna | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 30: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీయుడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో హైదరాబాద్లో డిసెంబర్ 3న మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్ తెలిపారు.
ఆదివారం హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో టీయూడబ్ల్యూజే హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 3న హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టిన మహాధర్నా కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు వెంటనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని, అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, వృత్తి కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు.
అనంతరం హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్ మాట్లాడుతూ.. రెండు సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం తాత్సారధోరణి అవలంభిస్తూ కాలయాపన చేస్తున్నదన్నారు. జర్నలిస్టుల సమస్యలపై పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యం వహిస్తున్నదని, ఈ క్రమంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 3న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ రాష్ర్టసమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం 10 గంటలకు మహాధర్నా నిర్వహించతలపెట్టినట్లు తెలిపారు.
ఈ ధర్నా కార్యక్రమానికి జాతీయ, రాష్ర్ట, జిల్లా, మండల కమిటీల నాయకులు, యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ర్ట ఉపాధ్యక్షులు గాడిపెల్లి మధు, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు కంకనాల సంతోష్, జాతీయ కౌన్సిల్ సభ్యులు పీవీ మదన్మోహన్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గడ్డం కేశవ మూర్తి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, సహాయ కార్యదర్శి పొడిశెట్టి విష్ణువర్ధన్, సీనియర్ నాయకులు సీహెచ్ సోమనర్సయ్య, ఎం.రాజేంద్రప్రసాద్, అనుముల రవి, దేవేందర్, ఎండి ఉస్మాన్ పాషా పాల్గొన్నారు.
Read Also :
Shiva 4K | శివ 4K వెర్షన్ను థియేటర్లలో మిస్సయ్యారా..? అయితే ఈ అప్డేట్ మీ కోసమే..!
Wheat | గోధుమలు అంటే కేవలం చపాతీలే కాదు.. ఇలా కూడా తీసుకోవచ్చు.. ఎన్నో లాభాలను అందిస్తాయి..!
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

