Wheat | గోధుమలు అంటే కేవలం చపాతీలే కాదు.. ఇలా కూడా తీసుకోవచ్చు.. ఎన్నో లాభాలను అందిస్తాయి..!
చపాతీలు అనగానే మనకు గోధుమ పిండి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే చాలా మంది గోధుమ పిండితోనే చపాతీలను తయారు చేసి తింటారు. గోధుమలను మరలో ఆడించి పిండిగా మార్చి ఆ పిండితో చపాతీలను చేస్తారు.
Wheat | చపాతీలు అనగానే మనకు గోధుమ పిండి గుర్తుకు వస్తుంది. ఎందుకంటే చాలా మంది గోధుమ పిండితోనే చపాతీలను తయారు చేసి తింటారు. గోధుమలను మరలో ఆడించి పిండిగా మార్చి ఆ పిండితో చపాతీలను చేస్తారు. కానీ గోధుమలు అంటే కేవలం చపాతీల కోసం మాత్రమేనా..? ఇంక దేనికీ వాటిని వాడలేమా..? అంటే.. వాడవచ్చు.. అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గోధుమలను కేవల చపాతీల కోసమే కాకుండా వాటిని ఇతర వంటకాలకు కూడా ఉపయోగించవచ్చు. అలాగే వాటిని నేరుగా కూడా తినవచ్చు. ఈ క్రమంలోనే గోధుమలను తరచూ తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఇవి మనకు అనేక పోషకాలను అందిస్తాయి. కనుక వీటిని తరచూ తింటుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గోధుమ మొలకలు..
గోధుమలతో చాలా మంది అనేక రకాల వంటకాలను చేస్తుంటారు. వీటితో పిండి వంటలను ఎక్కువగా చేస్తారు. అవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇక గోధుమలతో రవ్వను చేసి దాంతో కూడా పలు వంటకాలు చేస్తుంటారు. గోధుమ రవ్వతో తయారు చేసే ఉప్మా ఎంతో రుచిగా ఉంటుంది. ఇందులో పలు రకాల కూరగాయలను వేసి తయారు చేస్తే ఎన్నో పోషకాలను కూడా పొందవచ్చు. ఇక గోధుమలతో మొలకలను తయారు చేసి కూడా తినవచ్చు. వీటిని ఎండబెట్టి పిండి చేసి దాన్ని కూడా ఉపయోగించవచ్చు. సాధారణ గోధుమ పిండి కన్నా ఇలా మొలకలతో తయారు చేసే గోధుమ పిండిలో పోషకాల శాతం పెరుగుతుంది. ఇక గోధుమ మొలకలను పిండిగా మార్చి దాన్ని పటిక బెల్లం లేదా బెల్లంతో కలిపి తింటే శరీరానికి ఎంతో బలం కలుగుతుంది. దేహం దృఢంగా మారుతుంది. కండరాలు నిర్మాణం అవుతాయి. శారీరక శ్రమ లేదా వ్యాయామం చేసే వారికి ఈ ఆహారం ఎంతో మేలు చేస్తుంది.
గోధుమ రవ్వ..
గోధుమ రవ్వతో జావను తయారు చేసి అందులో కొద్దిగా ఉప్పు, చక్కెర కలిపి తాగుతుండాలి. దీని వల్ల జ్వరం వచ్చిన వారు త్వరగా కోలుకుంటారు. నీరసం, అలసట తగ్గుతాయి. శరీరానికి శక్తి లభించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ఉంటారు. బద్దకం పోతుంది. గోధుమ పిండితో హల్వాను తయారు చేసి తింటుంటే శరీరానికి బలం లభిస్తుంది. ముఖ్యంగా చిన్నారులకు దీన్ని తరచూ తినిపించాలి. దీని వల్ల వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ముఖ్యంగా వారి ఎముకలు నిర్మాణమవుతాయి. ఎముకలు దృఢంగా మారుతాయి. గోధుమ పిండిని కాస్త వేయించి దాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దానికి అంతే మోతాదులో చక్కెర కలిపి తింటుండాలి. దీని వల్ల కడుపులో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే గుండెల్లో మంట, అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. గోధుమలను మరలో నూకల్లా ఆడించి అనంతరం వాటితో అన్నం తయారు చేసి తింటుండాలి. దీని వల్ల దేహం పుష్టిగా మారుతుంది. దృఢంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
షుగర్ ఉన్నవారికి..
గోధుమలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఫైబర్ అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఉన్న ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఇలా బరువు తగ్గడం తేలికవుతుంది. షుగర్ ఉన్నవారికి గోధుమలు ఎంతో మేలు చేస్తాయి. గోధుమ రవ్వ లేదా గోధుమ నూకతో ఉప్మా, అన్నం వంటివి చేసుకుని తరచూ తింటుండాలి. దీని వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. గోధుమల్లో ఉండే ఫైబర్ షుగర్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే వీటిని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను సైతం తగ్గించుకోవచ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా గోధుమలతో మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- wheat
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | RC17 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. డిసెంబర్ చివరి వారంలో రామ్‌చరణ్-సుకుమార్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్!
KTR | తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

