Andre Russell | ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండ్రీ రస్సెల్.. ఇకపై కొత్త పాత్రలో కనిపించనున్న స్టార్ ఆల్‌రౌండర్..!
Andre Russell | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 ప్లేయర్స్ మినీ వేలానికి ముందు లెజెండరీ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్ రస్సెల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
Andre Russell | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2026 ప్లేయర్స్ మినీ వేలానికి ముందు లెజెండరీ వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల కోల్‌కతా నైట్‌రైడర్స్ రస్సెల్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, మినీ వేలంలో రసెల్‌కు భారీ ధర వస్తుందని అంతా భావించారు. కానీ, స్టార్ ఆల్‌రౌండర్ టోర్నీకి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబిలో జరుగనున్నది. 2014 నుంచి కేకేఆర్ ఫ్రాంచైజీలో ఉన్న రస్సెల్ త్వరలో కొత్త పాత్రలో కనిపించనున్నాడు. ఇకపై కేకేఆర్ కోచింగ్ స్టాఫ్‌లో భాగం కానున్నాడు. పవర్ కోచ్‌గా కేకేఆర్ నియమించింది. ‘తాను ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాను.
ఐపీఎల్ ఒక అద్భుతమైన ప్రయాణం. 12 సంవత్సరాల జ్ఞాపకాలు. కేకేఆర్ ఫ్యామిలీ నుంచి చాలా ప్రేమ ఉంది. నేను ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగ్‌లలో సిక్సర్లు కొట్టడం, వికెట్లు తీయడాన్ని కొనసాగిస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే.. నేను కేకేఆర్‌ను వదిలి వెళ్లడం లేదు. మీరు నన్ను కొత్త పాత్రలో చూస్తారు. 2026లో కేకేఆర్ సపోర్ట్ స్టాఫ్‌లో పవర్ కోచ్‌గా పని చేస్తాను. కొత్త అధ్యాయం. కానీ, అదే శక్తి, ఎల్లప్పుడూ నైట్ రైడర్స్‌లో భాగం’ అని పేర్కొన్నాడు. కరేబియన్‌కు చెందిన మరో లెజెండరీ టీ20 క్రికెటర్ కీరన్ పొలార్డ్ అడుగుజాడల్లో నడుస్తున్నాడు. పొలార్డ్ ముంబయి ఇండియన్స్‌కు బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్నాడు. గతంలో ముంబయి జట్టు తరఫున చాలాకాలం ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
37 సంవత్సరాల రస్సెల్ 11 సంవత్సరాల పాటు కేకేఆర్ తరఫున ప్రాతినిథ్యం వహించారు. 2014లో ఫ్రాంచైజీలో చేరాడు, జట్టులో కీలక ఆటగాళ్లలో రస్సెల్ ఒకడు. రస్సెల్ కేకేఆర్ తరఫున 133 మ్యాచులు ఆడాడు. 2014, 2024లో కేకేఆర్ టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్‌కు ముందు మెగా వేలానికి ముందు రస్సెల్‌ను రూ.12 కోట్లకు కేకేఆర్ నిలుపుకుంది. గత సీజన్లో ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడంతో కేకేఆర్ అతన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. 2025 సీజన్లో 13 ఇన్సింగ్స్‌లో 167 పరుగులు చేసి, ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ రస్సెల్ 140 మ్యాచుల్లో 174.18 రేట్ 2,651 పరుగులు చేయగా.. 123 వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

