హనుమకొండ చౌరస్తా, మార్చి 13: ఈనెల 21న ప్రపంచ కవితా దినోత్సవం(World Poetry Day) సందర్భంగా హనుమకొండ అశోక కాన్ఫరెన్స్ హాల్లో 3 గంటలకు ప్రపంచ శాంతి పండుగ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని, బహుభాషా కవిసమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రపంచ శాంతి పండుగ సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ మహమ్మద్ సిరాజుద్దీన్ తెలిపారు. గురువారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
అనేక కార్యక్రమాలతో పాటు బహుభాషా కవిసమ్మేళనాలను నిర్వహిస్తూ సాహిత్యం ద్వారా కూడా శాంతిని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగా బహుభాషా కవిసమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వచనం, పద్యం, గేయ రూపాలలో కవితలు ఉండవచ్చు, న్యాయ నిర్ణయతులదే తుది నిర్ణయం ఉంటుందన్నారు. ఇతర వివరాలకు ఆచార్య రవికుమార్ 9848893198, విప్పనపల్లి రవికుమార్ 9010785305, ప్రగళ్లపాటి రాజకుమార్ 7981622151, మహమ్మద్ సిరాజుద్దీన్ 9949710085 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.