హనుమకొండ చౌరస్తా, మార్చి11: హమాలీ హెల్పర్ బోర్డు కోసం మార్చి 15న నిర్వహించనున్న హమాలీ మహాగర్జన విజయవంతం చేయాలని తెలంగాణ హమాలి వర్కర్స్‌యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ హమాలి వర్కర్స్‌యూనియన్ కొద్ది మంది హమాలీ కార్మికులతో 2016లో పురుడు పోసుకొని నేడు అతిపెద్ద యూనియన్‌గా ఏర్పడిందన్నారు.
30 జిల్లాలలో సంఘం పనిచేస్తుందని, వేలాదిమంది సభ్యులతో బలమైన నిర్మాణం కలిగి ఉన్నదన్నారు. కార్మికులు అనేక సమస్యలతో కొన్నిచోట్ల పీఎఫ్, ఈఎస్ఐ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, తెలంగాణ రాష్ర్టంలో 10 లక్షల మందిపైగా హమాలీ కార్మికులు పనిచేస్తున్నారన్నారు. లోడింగ్, అన్లోడింగ్ రంగాలలో నిత్యం శ్రమచేస్తూ సరుకులు రవాణాలో రాష్ర్ట ఆర్థిక వ్యవస్థలో హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. హమాలీ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేదు, ఇతర రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ర్టంలో కార్మికులకు తక్కువ వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కూర వెంకట్, రమేష్, రాజబోయిన యాకయ్య, గోనే సదానందం, పిట్టా కరుణాకర్, సంపత్ పాల్గొన్నారు.