హనుమకొండ (ఐనవోలు): ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాలను పెరుమాండ్లగూడెం, గర్మిళ్లపల్లి, ముల్కలగూడెం ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు గురువారం ట్విన్నింగ్ ఆఫ్ స్కూల్ కార్యక్రమంలో భాగంగా సందర్శించారు. ఒంటిమామడిపల్లి పాఠశాల గతంలోనే పీఎంశ్రీ పథకంలో ఎంపికైన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా పాఠశాలకు మంజూరు అయిన నిధులతో ఇటీవల కొనుగోలు చేసిన, గతంలో ఉన్న సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్ గ్రంథాలయం, క్రీడా పరికరాలు తదితర అంశాలను విద్యార్థులు పరిశీలించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యాభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయన్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పులి ఆనందం, హెచ్ఎం సదానందం, ఏఏపీ చైర్మన్ సకినాబీ, పేరెంట్స్ కమిటీ చైర్మన్ నవీన్, వైస్ చైర్మన్ రాజు, కమిటీ సభ్యులు ఆనందం, ఇబ్రహీం, కరుణాకర్, మహ్మద్ రఫీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.