కమలాపూర్ : పెన్షన్ డబ్బుల(Pension money )కోసం తన కొడుకులు వేధింపులకు పాల్పడుతున్నారని మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన పిల్లల నారాయణ కలెక్టర్ ఫిర్యాదు చేశారు. నారాయణ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించి 30 ఏళ్ల క్రితం పదవి విరమణ పొందారు. 20 ఏళ్ల క్రితం భార్య చనిపోవడంతో స్వగ్రామంలో ఉంటున్నాడు. నారాయణకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుర్లు ఉన్నారు. పెద్దకొడుకు జయప్రకాష్ రిటైర్డ్ ఉపాధ్యాయుడు, రెండో కొడుకు వెంకటేశ్వర్లు, మూడో కొడుకు కుమారస్వామి ప్రైవేట్ టీచర్, నాలుగో కొడుకు అశోక్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 16 ఎకరాల వ్యవసాయ భూమి అమ్ముకొని కొడుకులకు పంచి ఇచ్చాను
కొంతకాలంగా అనారోగ్యానికి గురి కావడంతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాను. రెండో కొడుకు వెంకటేశ్వర్లు బాగోగులు చూసుకుంటున్నడు. రెండు ఎకరాల పొలం, పెన్షన్ డబ్బుల కోసం కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా కొడుకులు వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. 89 ఏళ్ల వయసులో ఇబ్బందులు పడుతున్న కొడుకులు పట్టించుకోవడంలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ముగ్గురు కొడుకులు పట్టణంలో ఉంటూ అక్కడే స్థిరపడి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయాడు. కొడుకుల బారి నుండి కాపాడాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు.