హనుమకొండ చౌరస్తా, జులై 19 : నాయీబ్రాహ్మణుల వృత్తిని దెబ్బతీసే ఆర్టికల్-19ని ఎత్తివేయాలని హనుమకొండ పట్టణ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం చౌరస్తా అధ్యక్షుడు సింగారపు శ్యామ్ డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ చౌరస్తాలో నాయీబ్రాహ్మణ హక్కుల కోసం రాబోయే రోజులలో ధర్నాలు నిరసనలు తెలుపాలని సంఘం తీర్మానించిందన్నారు.
మానవ సమాజానికి అతి దగ్గరగా ఉండే వృత్తి ఏదైనా ఉందంటే ఆది కేవలం నాయీబ్రాహ్మణులు మాత్రమేనని, 29 బ్రాహ్మణుల వృత్తిని ఇతర కులస్తులు దోపిడీ చేయాలని ప్రయత్నిస్తే వారికి ప్రభుత్వాలు కానీ పాలకవర్గం కానీ అండగా ఉంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి మాకు పేటెంట్ హక్కు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జంపాల వేణుగోపాల్, ముత్యాల శ్రీనివాస్, తక్కెళ్లపల్లి గంగాధర్, మొగిలిచర్ల ప్రసాద్, సదానందం, రమేష్, మురాహరి రాకేష్ పాల్గొన్నారు.