Khila warangal | ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు నిలిపివేతపై సర్పంచ్ల ఆగ్రహం
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించిన నిధులను నిలిపివేయడంతో 9 గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానిక సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు.
ఖిలావరంగల్, మార్చి 23 : వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ పనులకు సంబంధించిన నిధులను నిలిపివేయడంతో 9 గ్రామాల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని స్థానిక సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై వారు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదకు వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలకు రావాల్సిన అభివృద్ధి నిధులను డివిజన్ యూనిట్‌గా మార్చడం వల్ల గ్రామాలకు న్యాయం జరగడం లేదని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద పని చేసిన పనిదినాలకు సంబంధించిన 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు తీవ్రంగా ప్రభావితమవు తున్నాయని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల గ్రామాల్లో ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి పనులు నిలిచిపోయి, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే నిధులను విడుదల చేసి, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రాన్ని సమర్పించిన వారిలో ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్, ధర్మారావుపేట్ సర్పంచ్ ఎం వెంకన్న, మనుబోతులగడ్డ సర్పంచ్ ఏ శ్రీలత అశోక్, నానితండ సర్పంచ్ జ్యోతి, కోడ్తిమాట్ తండా సర్పంచ్ ఎల్ వసంత ఉన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

