ధర్మసాగర్ : పౌష్టికాహారంతోనే చిన్న పిల్లలలో సరైన ఎదుగుదల వస్తుందని సర్పంచ్ పుట్ట రేణుక సూచించారు. సోమవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని నారాయణగిరి గ్రామంలోని అంగన్ వాడీ కేంద్రాలను ఆమె సందర్శించి పిల్లలకు పౌష్టికాహారం అందించారు. అలాగే రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎదిగే పిల్లలకు పోషకాహారం అందించాలన్నారు.
సమతుల ఆహారంతోనే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రఘు, ఉపసర్పంచ్ వల్లపురెడ్డి సంధ్య రెడ్డి, వార్డు సభ్యుడు రాజ్ కుమార్, అంగన్ వాడీ టీచర్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.