బచ్చన్నపేట, ఫిబ్రవరి 02 : గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారంకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని జనగామ జిల్లా ఆలీంపూర్ గ్రామ సర్పంచ్ పాకాల నాగలక్ష్మి అన్నారు. సోమవారం పంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలిసి ఆమె మాట్లాడుతూ గ్రామంలోని అన్ని వార్డులకు ప్రతి రోజు తాగునీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. సిబ్బంది ఆయా వార్డులకు వెల్లినప్పుడు పరిసరాలు పరిశుభ్రం చేసి సంబంధిత వార్డు సభ్యుడి సంతకం తీసుకోవాలన్నారు.
సిబ్బంది ఆయా వార్డులకు వెల్లినప్పుడు పరిసరాలు పరిశుభ్రం చేసి సంబంధిత వార్డు సభ్యుడి సంతకం తీసుకోవాలన్నారు. వీధి దీపాలు ఎక్కడ వెలగడం లేదో పంచాయతీకి సమాచారం అందించాలన్నారు. అంతే కాకుండా గ్రామంలో వాటర్‌ప్లాంట్ నడిపించే విధంగా కృషి చేస్తామన్నారు. ఇందుకు గాను త్వరలో గ్రామసభ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా వార్డుల్లో చెడిపోయిన బోరు మోటర్లను మరమ్మతు చేయిస్తామని అన్నారు. ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకూడదన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మామిడాల ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి బాల్నె రేవతిగౌడ్, కారోబార్ మురళి, పంచాయతీ వార్డు సభ్యులు పోతుగంటి స్రవంతి, పర్వతం ఉప్పలయ్య, గందమల్ల నవనీత, పాకాల మధు, పాకాల బాలక్రిష్ణ, ఎలికట్టె గణేశ్, రాగీరు కుమారస్వామి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.