భీమదేవరపల్లి, నవంబర్ 10: ప్రతి ఏట శబరిమలైకి (Sabarimala) గురుస్వామి అప్పని నటరాజ్ కాలి నడకన వెళ్తారు. ఇందులో భాగంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన అప్పని నటరాజ్ గత నెల 16న ఇక్కడి శివాలయం నుంచి ఇరుముడులతో మహా పాదయాత్ర (Sabarimala Padayatra) ప్రారంభించారు. ఇప్పటివరకు 850 కిలోమీటర్లు దూరం నడిచినట్లు గురుస్వామి అప్పని నటరాజ్ తెలిపారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మీదుగా మహా పాదయాత్ర సాగి, సోమవారం తమిళనాడు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు వెల్లడించారు. మరో 600కిలోమీటర్లు నడవాల్సి ఉందని, ఈ నెల 26న శబరిమల చేరుకుంటామని తెలిపారు. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో 80 మంది వరకు ఈ పాదయాత్రలో పాల్గొన్నారని చెప్పారు. భక్తి, ఆరాధన, అకుంఠిత దీక్ష, ఆత్మస్థైర్యంతో ఈ యాత్ర ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. ఆయనతో పాటు అయ్యప్ప స్వాములు హరీష్, బిట్టు, శివయ్య, సంపత్, రాము, మంథని, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
