Thousand Pillars Temple | అర్ధనారీశ్వరునిగా వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి అలంకరణ
చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉత్తిష్టగణపతి ఆరాదన రుద్రునికి రుద్రాభిషేకం నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 17: చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు ఉత్తిష్టగణపతి ఆరాదన రుద్రునికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రుద్రేశ్వరస్వామికి 51 కిలోల పెరగన్నం, మిరియాలు పొడి, సొంటిపొడితో అన్నసూక్త మంత్రపఠనంతో రుద్రునికి అన్నపూజ నిర్వర్తించి అర్ధనారీశ్వరునిగా అలంకరించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుపతి జిల్లా పుంగనూరు నుంచి వచ్చిన శ్రీశ్రీ నరేంద్రకుమారస్వామి భక్తులనుద్దేశించి అనుగ్రహభాషణం చేశారు.
ఆలయ ప్రాంగణంలో చాడ వాసుదేవరెడ్డి, అనిల్ కేడియా, ప్రతీక్ కేడియా, సరోజనమ్మ దాతృత్వంతో నిర్వహించిన మహాన్నదాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్యవైశ్య ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు గట్టు మహేశ్‌బాబు పాల్గొని అన్నప్రసాదవితరణ చేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, గంగు మణికంఠశర్మ, ప్రణవ్, సందీప్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సతీష్‌కుమార్, కట్ల రాజు, సిబ్బంది రామకృష్ణ, రజిత పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

